ప్రభాస్ స్వీటీ అనడంతో.. మళ్ళీ..

Update: 2017-12-20 16:41 GMT
బాహుబలి సినిమాతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క - ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సినిమా కథకు అయిదేళ్ల వరకు కష్టపడి అందరిని మెప్పించారు. అంతే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని కూడా అందుకున్నారు. ఇకపోతే వీరి జోడికి కొన్ని రూమర్స్ జత కలిసిన సంగతి తెలిసిందే. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని లవ్ లో ఉన్నారని అనేక వార్తలు కన్ఫ్యూజన్ కి గురి చేశాయ.

అయితే ఆ రూమర్స్ పై ఫైనల్ గా ప్రభాస్ క్లారిటీ ఇవ్వడంతో కొంతమంది నమ్మినా కూడా మరి కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ అనుష్క గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ అయ్యింది. అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందరే టీజర్ బావుందని అనుష్కను పొగిడారు. కానీ ప్రభాస్ ను మాత్రం చాలా స్పెషల్ గా పొగిడారు.

ఆమె ప్రతిసారి ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.. గుడ్ లక్ స్వీటీ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పడంతో నార్త్ అభిమానులు పలురకాలుగా స్పందిస్తున్నారు. సాధారణంగా అనుష్కను అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. సౌత్ లో ఇది అందరికి తెలిసిన విషయమే కానీ నార్త్ సైడ్ నెటిజన్స్ మాత్రం ఇంకా వీరి మధ్య రిలేషన్ ఉందా అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కామెంట్స్ పై ప్రభాస్ మళ్లీ స్పందిస్తాడో లేదో చూడాలి.  అయితే కేవలం స్వీటి అని పిలిస్తే మళ్లీ ఇలా గాసిప్స్ మొదలెట్టేస్తారా అంటూ తెలుగు అభిమానులు గరం అవుతున్నారు.
Tags:    

Similar News