నిజమే.. అందానికి అందం.. వంక పెట్టలేని అభినయం.. అన్ని ఉన్నా అవకాశాలు రాకపోవటానికి మించిన వేదన మరేం ఉంటుంది. టాలెంట్ కు తక్కువ లేనప్పటికీ ఛాన్సులు మాత్రం అంతంతమాత్రంగా ఉండే చేప కళ్ల ప్రణీత.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.
వరుస పెట్టి ప్రయత్నాలు చేసినా.. ఆమెకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. అందం.. అభినయం విషయంలో వంక పెట్టే వీల్లేని ఆమె ఈ మధ్యనే తన ప్రియుడు కమ్ వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడారు. ప్రస్తుతం తన టాలెంట్ ను ఫ్రూవ్ చేసే ఛాన్సు కోసం ఆమె తెగ ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటివేళ.. ఒక్కోసారి ఫస్ట్రేషన్ రావొచ్చు. ప్రస్తుతం ప్రణీత అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. తాజాగా ఆమె తన ఇన్ స్టా స్టోరీలో తన ఆవేదనను తెలియజేస్తూ రాసుకొచ్చింది. నటీనటుల జీవితాలకు సంబంధించిన ఎలాంటి విషయమైనా ఆసక్తిగానే ఉంటుంది. అందుకే నిలకడ లేకున్నా.. ఈ జీవితాన్ని ఎంచుకుంటాం. ఇక్కడ జీవితాలకు గ్యారెంటీ ఉండదు. మా శరీరాల్ని కఠిన పరిస్థితుల్లో పడేస్తాం.
నటీనటుల జీవితాలు మొత్తం కష్టం.. సమస్యలు.. ఒడిదుడుకులు..కొన్నిసార్లు చీకట్లతో నిండి ఉంటాయి. విజయాన్ని.. అపజయాన్ని కాస్త వ్యవధిలోనే చూస్తుంటాం. ఇబ్బందికర పరిస్థితుల్లోసైతం మేం కూర్చుంటాం. లేస్తాం.. తింటాం.. పడుకుంటాం' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
అయినప్పటికి తాము గౌరవం లేని జీవితాల్ని గడుపుతూ ఉంటామని.. అనారోగ్యకరమైన షెడ్యూల్ లో పని చేస్తుంటామన్నారు. చలికి వణుకుతూ.. వర్షంలో తడుస్తూ.. ఇంటి వారికి.. బంధువులకు దూరంగా ఉంటూ పని చేస్తుంటామన్నారు. తమ సామర్థ్యానికి మించిన పని చేస్తామని.. ఇదంతా చేసేది సంతోషానికి గురి చేసే ఒక సరైన బ్రేక్ కోసమేనని చెప్పారు.
ప్రణీత పోస్టు చేసిన తాజా బ్రీఫ్ నోట్ ను చూస్తే.. ఆమె ఇప్పుడెంత ఫస్ట్రేషన్ లో ఉందో అర్థమవుతుందని చెప్పాలి. నిజమే.. అన్ని ఉన్నా అవకాశాలు రాకపోతున్నప్పుడు ఆ మాత్రం ఆవేదన ఉంటుంది కదా.