తెలుగు బిగ్ బాస్ గత ఆరు వారాలుగా చప్పగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ప్రియా ఓవర్ యాక్షన్ తో సూపర్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఇదే సమయంలో ఆమెపై తీవ్రమైన విమర్శలు పెరుగుతున్నాయి. మొదటి నుండి సన్నీ మరియు ప్రియాల మద్య వ్యవహారం సరిగా లేదు. ఇద్దరు కూడా గొడవ పెంచుకుంటూ వెళ్తున్నారు. గత వారం ఎలిమినేషన్ నామినేషన్ సమయంలో నేను ఉన్నన్ని రోజులు ప్రతి వారం మిమ్ములను నామినేట్ చేస్తూనే ఉంటాను అన్నాడు. అందుకు బాగా సీరియస్ అయిన ప్రియా అతడిని రెచ్చగొట్టే విధంగా టార్గెట్ చేసి అతడి సహనాన్ని పరీక్షిస్తుంది. గత రెండు ఎపిసోడ్ లుగా ప్రియా ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదు. ఆమె ముఖ్యంగా సన్నీ ఆటను టార్గెట్ చేయడంతో పాటు సన్నీకి కోపం తెప్పించి అతడిని బ్యాడ్ చేయాలని చూస్తుంది.
మాటలతో రెచ్చగొడుతూ అతడి కోపాన్ని బయటకు తీస్తుంది. తాజా ఎపిసోడ్ లో ఏకంగా అతడిని పలు సార్లు చెంప పగులుద్ది అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడి తీవ్ర దుమారం రేపింది. మొత్తంగా ఆమె తీరును ప్రతి ఒక్కరు విమర్శించేలా చేసింది. సన్నీకి ఆమె వల్ల అనూహ్యంగా బలం పెరిగింది. ఆమె మాట్లాడిన మాటలు సాదారణంగా ప్రతి ఒక్కరికి ఒల్లు మండి పోయేలాగే ఉన్నాయి. అయినా కూడా సన్నీ మాత్రం చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇతర కంటెస్టెంట్స్ పై ఆ ప్రస్టేషన్ ను చూపిస్తున్నాడు. మొత్తంగా సన్నీ చాలా సీరియస్ గా ఉన్నాడు. ప్రియా మాత్రం అతడిని ఇంకా ఇంకా కూడా రెచ్చగొడుతూనే ఉంది. ఈ విషయంలో సన్నీ తప్పు ను చూపిస్తాడా లేదంటే ప్రియా ను మందలిస్తాడా అంటూ నాగార్జున వైపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సోషల్ మీడియాలో కొన్ని వేల మంది నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ప్రియాకు క్లాస్ పీకకుంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ హెచ్చరిస్తున్నారు. సన్నీని చెంప పగులుద్ది అంటూ పదే పదే వ్యాఖ్యలు చేయడంతో పాటు పూర్తిగా అతడి ఆటను టార్గెట్ చేయడం పై చాలా మంది సీరియస్ అవుతున్నారు. నాగార్జున కనుక ఈ విషయంలో స్పందించకుంటే మాత్రం ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా అన్ ఫిట్ అంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ నుండి ప్రియాను వెంటనే ఎలిమినేట్ చేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రియా ఈ వారంలో ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉంది. కనుక ఆమె ఎలిమినేట్ అయ్యేలా చేయాలని కూడా నాగార్జునను డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నాగార్జున తీరు ఎలా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియా మరియు సన్నీల ఎపిసోడ్ లో 99 శాతం మంది సన్నీకే మద్దతుగా నిలుస్తున్నారు.