కనిపించదు కాని.. చాలా సీనియరే

Update: 2016-06-04 05:52 GMT
ఇప్పుడు మన దగ్గర సీనియర్‌ మోస్ట్ హీరోయిన్‌ ఎవరంటే.. 2001లో వచ్చిన శ్రీయ పేరు చెప్పేస్తారు అందరూ. అయితే కనపించదు కాని.. డస్కీ బ్యూటి ప్రియమణి కూడా చాలా సీనియరే. చాలా చిన్న వయస్సులోనే అమ్మడు సినిమా హీరోయిన్ అయిపోయింది. 2003లో వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్‌ లో లీడ్ గాళ్‌ గా ఎంట్రీ ఇచ్చింది తెలుసా.

అంటే షుమారు 13 ఏళ్ళ నుండి మనకు హీరోయిన్‌ గా తెలుసు అమ్మడు. 2006లో పెళ్లయిన కొత్తలో.. 2007లో యమదొంగ వంటి సినిమాలతో మాంచి ఫామ్ లోకి వచ్చింది. కాని ఆ క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. నితిన్‌ సరసన చేసిన ధ్రోణ సినిమాలో బికినీ లుక్ అందరినీ డిజప్పాయింట్‌ చేసింది. అప్పటినుండి సినిమాలొస్తున్నాయి కాని.. క్రేజ్ మాత్రం రావట్లేదు. కాకపోతే మంచి నటి అని అందరికీ తెలుసు. సరైన ఛాన్సులు వచ్చినా.. ఆమె సరైన ఛాన్సులను అందుకుని ఉన్నా.. ఇప్పటికీ ఇంకా హీరోయిన్ గా స్టార్డమ్ తో వెలిగిపోయేదేమో.

ఇంతకీ ఈ సీనియర్‌ లేడీ గురించి ఎందుకు చెబుతున్నాం అంటే.. ఈరోజు (జూన్ 4) అమ్మడు పుట్టినరోజు. బహుశా తన బ్యాచిలర్‌ హుడ్‌ ను వదిలేసి.. ప్రియుడు మస్తాఫా రాజ్‌ తో నిశ్చితార్ధం అయ్యాక ఇదే మొదటి బర్తడే. ప్రస్తుతం కేవలం డ్యాన్స్ షో లో జడ్జ్ గా కొనసాగుతున్న ప్రియమణి.. వచ్చే ఏడాదే పెళ్ళి చేసుకోనుంది. హ్యాపీ బర్తడే ప్రియ!!
Tags:    

Similar News