నేనింకా ఆటలోనే ఉన్నా

Update: 2016-01-20 04:37 GMT
బెంగళూరు బ్యూటీ ప్రియమణి సౌత్ లోని అన్ని భాషల్లోనూ నటించింది. ఇప్పుడు ఛాన్సులు బాగా తగ్గాయేమో కానీ.. ఒకేసారి చేతిలో డజన్ ఆఫర్లు కూడా ఉన్న రికార్డ్ ఈమెకు ఉంది. ఇప్పటికీ మళయాళ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఓ డ్యాన్స్ రియాలిటీ షోకి జ్యూరీ మెంబర్ గా ఉంటూ.. కేరళ జనాలకు టచ్ లోనే ఉంటోంది ప్రియమణి.

ఆసిఫ్ ఆలీతో ఓ మళయాల ప్రాజెక్ట్ ను యాక్సెప్ట్ చేయగా.. ఫిబ్రవరి నుంచి ఇది పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రియమణి చెబుతోంది. టెలివిజన్ తో ప్రేక్షకులకు దగ్గర కావడం చాలా ఆనందంగా ఉందంటన్న ఈ భామ.. త్వరలో తమిళ్ లోనూ ఓ డ్యాన్స్ రియాలిటీ టీవీ షోకి జడ్జ్ గా కనిపించనున్నట్లు తెలిపింది. ఈమె చాలా అప్పుల్లో కూరుకుపోయిందని, అందుకే మళ్లీ సినిమాలు చేస్తున్నట్లుగా వస్తున్న రూమర్స్ పై కూడా స్పందించింది. ప్రియమణికి సహాయం చేసేందుకు కన్నడ మూవీలో ప్రకాష్ రాజ్ ఆఫర్ ఇచ్చాడన్నది ఓ రూమర్స్ సారాంశం.

'ఇప్పటికీ ప్రతీ రోజూ నాకు ఆఫర్స్ గురించి ఏదో ఒక కాల్ వస్తూనే ఉంది. స్టోరీ వినమని ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను అన్నింటినీ ఒప్పుకోలేకపోతున్నాను. చేశాం అంటే చేశాం అనేలా ఉన్నవాటిని కాకుండా.. ఏదైనా థ్రిల్ ఇచ్చే సబ్జెక్టులను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను' అంటోందీ సీనియర్ సుందరి. అంతే కాదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నానంటోంది. ఈమెకు డ్రీమ్ రోల్ కూడా ఉందండోయ్. రోహిత్ షెట్టి తీసిన గోల్ మాల్ సిరీస్ టైపులో.. ఫుల్ లెంగ్త్ కామెడీ చేయాలన్నది ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ హీరోయిన్ కోరిక.

Tags:    

Similar News