బాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈసారి స్పెయిన్ లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇలాంటి ఈవెంట్స్ లో భారీ మొత్తం చెల్లించి బాలీవుడ్ తారలతో స్పెషల్ డ్యాన్స్ లను చేయించడం నిర్వాహకులకు ఆనవాయితీ. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు. సుందరాంగులు కూడా పెద్ద మొత్తాన్ని అందుకుని ట్యాలెంట్ చూపించేందుకు ఉత్సాహం చూపిస్తారు.
ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ప్రియాంక చోప్రా - దీపికా పదుకొనేలకు కళ్లు తిరిగే మొత్తం అందిందని తెలుస్తోంది. మాడ్రిడ్ లో చేసిన సర్వేలో.. అక్కడి ప్రజలు వీళ్లను చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారని తేలడంతో.. వీరి డ్యాన్సులు కచ్చితంగా ఉండాలనే డెసిషన్ కి నిర్వాహకులు వచ్చేశారు. తమకి ఎంత డిమాండ్ ఉందో చూచాయగా విషయం తెలిసిన భామలు పెద్ద మొత్తంలో డిమాండ్ చేసేస్తున్నారు. ఒక్కో నిమిషానికి 33 లక్షలు చొప్పున పేమెంట్ ఇస్తే.. డ్యాన్స్ చేస్తా అని దీపిక తేల్చేసిందిట. అలా ఒక పాటకు గాను 1.32కోట్ల మొత్తం చెల్లించేందుకు రెడీ అవగా.. ప్రియాంక నుంచి కూడా సేమ్ డిమాండ్ వచ్చింది.
అయినా సరే బాలీవుడ్ అవార్డ్స్ షో నిర్వాహకులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎంతమొత్తం అయినా ఇచ్చి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రదర్శనలకు గాను సల్మాన్ ఖాన్ 5 కోట్లు.. హృతిక్ రోషన్ 4 కోట్లు వసూలు చేస్తున్నాడని తెలుస్తోంది.