సంక్రాంతికి వస్తున్నాం: హౌస్ ఫుల్స్ తో ఊహించని బజ్
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా విడుదల తర్వాత మంచి స్పందనతో దూసుకుపోతుంది
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా విడుదల తర్వాత మంచి స్పందనతో దూసుకుపోతుంది. సంక్రాంతి ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లతో పాటు భారీ హిస్టీరియాను సృష్టిస్తోంది. మూడో రోజు సాయంత్రం, రాత్రి షోలు నైజాం ఆంధ్రప్రదేశ్‌లో మరింత హడావుడిగా ఫుల్ అవ్వడం విశేషం. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ స్తాయిలో రెస్పాన్స్ రావడం విశేషం.
నైజాంలోనే సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. హైదరాబాద్‌లో 215 షోల్లో 260 దాటి హౌస్‌ఫుల్ కావడం చూస్తే నైజాంలో "సంక్రాంతికి వస్తున్నాం" మూడో రోజు హిస్టరీ సృష్టించిందనే చెప్పాలి. వరంగల్‌లో 15/15, నిజామాబాద్‌లో 7/7, కరీంనగర్‌లో 6/6 షోలు పక్కా హౌస్‌ఫుల్ అయ్యాయి. కోడద, ఖమ్మం, సూర్యాపేట వంటి చిన్న పట్టణాల్లో కూడా 100% ఆక్యుపెన్సీ రేటు సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిని చూపుతోంది. మొత్తంగా నైజాంలో 260 షోలు 305లో పూర్తిగా భర్తీ కావడం సినిమాకు మంచి పాజిటివ్ బజ్ ఉందని నిరూపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడో రోజు సాయంత్రం, రాత్రి షోలు పండగ వాతావరణాన్ని తెచ్చాయి. విజయవాడలో 53/53, విశాఖపట్నంలో 48/49 షోలకు ప్రేక్షకులు పూనకాలు తెచ్చారు. గుంటూరు, కడప, కర్నూల్, తిరుపతి, ఒంగోలు వంటి ప్రాంతాల్లో కూడా 100% ఆక్యుపెన్సీ రేటుతో సినిమా హవాను కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 207/217 షోలకు హౌస్‌ఫుల్ అయ్యి "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాపై అభిమానుల స్పందన ఎంతగానో ఉందని రుజువైంది.
విక్టరీ వెంకటేష్ తన ఎనర్జీ, టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో మరోసారి విజయవంతమయ్యారు. అనిల్ రావిపూడి కామెడి మేకింగ్ ఫ్యామిలీ డ్రామా కంటెంట్‌ను హైలెట్ చేస్తూ, ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను ప్రభావితం చేయగలిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
"సంక్రాంతికి వస్తున్నాం" సినిమా నేటికీ తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తోంది. ప్రతి ఏరియాలో హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తూ, సంక్రాంతి సెలవుల్లో బిగ్ ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాగా నిలిచింది.
మూడో రోజు షోలు లెక్కవారి వివరాలు: నైజాం (మొత్తం షోలు):
హైదరాబాద్: 215/260
వరంగల్: 15/15
కరీంనగర్: 6/6
నిజామాబాద్: 7/7
కోడద: 3/3
ఖమ్మం: 3/3
సూర్యాపేట: 3/3
మహబూబ్‌నగర్: 2/2
మేడక్: 2/2
సిద్ధిపేట: 1/1
ఆదిలాబాద్: 1/1
నల్గొండ: 1/1
సంగారెడ్డి: 1/1
ఆంధ్రప్రదేశ్ (మొత్తం షోలు):
విజయవాడ: 53/53
విశాఖపట్నం: 48/49
గుంటూరు: 24/26
నెల్లూరు: 10/15
కాకినాడ: 15/15
రాజమండ్రి: 7/7
ఒంగోలు: 13/13
తిరుపతి: 7/7
మచిలీపట్నం: 6/6
అనంతపురం: 4/4
కడప: 8/8
కర్నూలు: 12/14