నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూటర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఆయన డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా తనదైన మార్కుని క్రియేట్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఒక దశలో ఆయన పట్టిందల్లా బంగారమే అవుతూ వచ్చింది కూడా. దీంతో దిల్ రాజు పేరు టాలీవుడ్ లో మారు మోగిపోయింది.
నాలుగేళ్లు డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఆయన 'దిల్'తో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోని ఆయన ఇండస్ట్రీలోకి ప్రవేశించిన 20 ఏళ్లవుతోంది. తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న దిల్ రాజు భారీ సినిమాలకు, స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. గత కొంత కాలంగా కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారుతున్న ఆయన తొలి సారి తమిళ హీరో విజయ్ తో నిర్మిస్తున్న 'వారసుడు' సినిమాతో వార్తల్లో నిలిచారు.
సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ చుట్టూ వివాదం అలుముకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు పలు షాకింగ్ విషయాల్ని ఈ సందర్భంగా వెల్లడించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో అడిగిన పలు ప్రశ్నలకు దిల్ రాజు ఆసక్తికర సమాధానాలు చెప్పడం విశేషం. డిస్ట్రి బ్యూటర్లకు సినిమా చూపించకుండానే అమ్మేస్తారని స్పష్టం చేశారు.
డిస్ట్రిబ్యూషన్ రంగం పతనం అవుతోందంటే దానికి ప్రధాన కారణం నిర్మాతలే అని చెప్పారు. డబ్బు ఇచ్చేదగ్గర నిర్మాత ఫస్ట్ పర్సన్ అవుతున్నాడని, అదే డబ్బు తీసుకునే దగ్గర మాత్రం లాస్ట్ పర్సన్ అవుతున్నాడన్నారు. 'బాహుబలి 1' నిర్మాత నెగెటివ్ అన్నారు. నేను నిర్మాతగా ప్రయాణం మొదలు పెట్టి 20 ఏళ్లవుతోంది. నాతో పాటు రియల్ ఎస్టేట్ లో ప్రయాణం మొదలు పెట్టిన వాళ్లు ఎక్కడో వున్నారు. నేను మాత్రం ఇక్కడే వున్నాను అన్నారు దిల్ రాజు.
ఈ సందర్భంగా సినిమా అంటే ఏంటో పచ్చిగా డెఫినెషన్ చెప్పారు. సి అంటే 'సి'గ్గు ..'నీ'తి..'మా'నం లేకుండే వాళ్లని అందుకే ఈ పేరొచ్చిందేమో అంటూ నవ్వేశారు. ఇక దశలో బాలీవుడ్ వాళ్లే రూ. 100 కోట్లు అడిగే వారు.. ఇప్పడు తెలుగు హీరోలు కూడా వంద కోట్లు అడుగుతున్నారని అడిగితే.. తీసుకునేవాళ్లది తప్పుకాదుగా అన్నారు దిల్ రాజు. ఇండస్ట్రీ అంటే అంతా కలిసి కట్టుగా వుండటం కుదరదు. పేరుకు మాత్రం మేం అంతా ఫ్యామిలీ అని అంటుంటాం అంతే అన్నారు. ఇండస్ట్రీలో మనం చెబితే ఎవరూ వినరు..ఎవడి దారి వాడిదే.
నా 37 థియేటర్లతో మోనోపలి అవుతుందా? .. అంటే 'వారసుడు' వివాదం అవుతోందిగా అని ప్రశ్నించారు. ఈ వివాదం వెనక ఎవరెవరున్నారు.. ఎందుకు చేస్తున్నారు అన్నది నాకు మొత్తం తెలుసు. కానీ నేను ఎప్పుడూ అనలేదు. ఓపెన్ గా నేను ఎవరినీ కౌంటర్ చేయను.. చేయలేదు కూడా అన్నారు. అయితే దిల్ రాజు మీద అసూయ పెరిగిందంటారా? అని అడిగితే..అది మీరే చెప్పాలని నవ్వేశారు. దిల్‌రాజు ఓ బ్రాండ్ అయ్యాడు కాబట్టే ప్రతీదీ ప్లాబ్లమ్ అవుతోంది.. ప్రాబ్లమ్ చేస్తున్నారు. ఇదే కాకుండా దిల్ రాజు ఈ కార్యక్రమంలో మరిన్ని షాకింగ్ విషయాల్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఏం చెప్పారన్నది తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ కోస ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.