టాలీవుడ్ లో పాపులర్ నిర్మాతలు దిల్ రాజు, లక్ష్మణ్, శిరీష్ ల గురించి తెలిసిందే. వీరు ముగ్గురు కలిసి శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించారు. ఎన్నో ఫ్యామిలీ హిట్స్.. కమర్షియల్ హిట్స్ అందుకొని మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అంటే ముందుగా దిల్ రాజు, లక్ష్మణ్ ల పేర్లు వినిపిస్తాయి. ఆ తర్వాతే శిరీష్ పేరు వినిపిస్తుంది. అయితే కొంతకాలంగా ఆ నిర్మాణ సంస్థకు.. దిల్ రాజు, శిరీష్ లకు దూరంగా ఉంటూ వస్తున్న లక్ష్మణ్ తాజాగా సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. 'బ్రిడ్జ్ ప్రొడక్షన్స్' అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆయన స్వయంగా ఇటీవలే ప్రకటించారు. ఇక లక్ష్మణ్ దిల్ రాజు నుండి విడిపోవడం పై టాలీవుడ్ లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇక బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తక్కువ బడ్జెట్ సినిమాల నుండి భారీ బడ్జెట్ సినిమాల వరకు నిర్మిస్తానని.. అంతేగాక సినీ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచే చిత్రాలు మాత్రమే నిర్మిస్తానని లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
ఇప్పటికే నైజాం ఏరియాలో పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన లక్ష్మణ్.. ఆ రంగంలో విశేషానుభవం గడించాడు. అంతేగాక సినిమాల మీద లక్ష్మణ్ జడ్జ్‌మెంట్.. స్క్రిప్టుల ఎంపికలో ఎంత పకడ్బందీగా ఉంటుందో ఇండస్ట్రీలోని వారందిరికీ తెలుసని సమాచారం. ఇదిలా ఉండగా బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మొదటగా భారీ బడ్జెట్ సినిమాలను ఆయన నిర్మించనున్నారట. త్వరలోనే కొత్త సినిమాల వివరాలను ప్రకటిస్తారట. అయితే ఏప్రిల్‌లోనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాలని అనుకున్న లక్ష్మణ్.. ఈ కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అప్పటి నుండి కొత్త సినిమాల నిర్మాణ పనులు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా.. నిర్మాణ సంస్థలకు ఎప్పుడు పని దొరుకుతుందా అని సినీ కార్మికులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో లక్ష్మణ్ మొదలుపెట్టిన బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కొందరికైనా ఆసరాగా నిలుస్తుందేమో చూడాలి!