ప్రపంచంలో ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన రికార్డ్‌ ఈ హీరో సొంతం

Update: 2021-01-28 10:30 GMT
ఈమద్య కాలంలో హీరోలు ఏదాదికి ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. మహా అయితే రెండవ సినిమాను కూడా కొందరు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న హీరోలు కొత్త హీరోలు కూడా రెండు మూడు సినిమాలకే చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్‌ హీరోల్లో కొందరు ఏడాదిలో రెండు మూడు సినిమాలు విడుదల చేస్తేనే వావ్‌ అంటున్నారు. అలాంటిది ఒక హీరో ఒకేసారి నాలుగు అయిదు సినిమాలు కమిట్‌ అయితే వావ్‌ వాడు సూపర్ హీరోరా బుజ్జి అన్నట్లుగా ఉంది పరిస్థితి. అలాంటిది ఒక హీరో ఏకంగా 30 సినిమాలను లైన్‌ లో పెట్టాడు. రాబోయే మూడు ఏళ్లలో ఆ హీరో చేయబోతున్న ఆ సినిమాల జాబిత ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మలయాళ స్టార్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న పృథ్వీ రాజ్‌ వరుస సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కేవలం మలయాళంలోనే కాకుండా మొత్తం సౌత్‌ ఇండియా అటు నార్త్‌ ఇండియాలో కూడా గుర్తింపు పున్న హీరో పృథ్వీరాజ్‌ ఏకంగా 30 సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ఒకప్పుడు హీరోలు వరుసగా పది సినిమాలకు కమిట్‌ అయ్యే వారు. 1980 లలో తెలుగు స్టార్ హీరోలు ఏడాదికి పదికి ఎక్కువ సినిమాలను చేసేవారు. వారు అప్పుడు ఎలా చేశారా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటారు. కాని ఇప్పుడు పృథ్వీ అదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. ఏడాదికి పది సినిమాల చొప్పున వరుసగా చేసేందుకు సిద్దం అయ్యాడు.

ప్రపంచంలో ఏ హీరో కూడా ఒకే సారి 30 సినిమాలకు కమిట్‌ అవ్వడం చూసి ఉండరు. పృథ్వీ రాజ్‌ ఏదో పై మాటకు సినిమాలకు కమిట్‌ అవ్వడం కాదు. అందులో ఇప్పటికే కొన్ని టైటిల్స్ ఫిక్స్‌ అయ్యాయి. మరి కొన్ని స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్నాయి. ప్రతి సినిమాకు డేట్ ఖరారు అయ్యి ఉంది. కనుక పృథ్వీ రాజ్‌ ఆ 30 సినిమాల్లో ఏ ఒక్కదాన్ని కూడా వదిలే ఛాన్స్‌ లేదని అంటున్నారు. 30 సినిమాల్లో ఈ ఏడాది కనీసం అరడజనుకు పైగా సినిమాలు అయినా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. పృథ్వీరాజ్‌ రికార్డ్‌ అన్‌ బీటబుల్‌ అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News