టాలీవుడ్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమాల్లో పూరి జగన్నాథ్ తీసిన ‘పోకిరి’ ఒకటి. దశాబ్దం కిందట ఆ సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సమయానికి టాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అదే. ‘పోకిరి’ స్ఫూర్తితో ఆ తరహా సినిమాలు మరెన్నో వచ్చాయి. ముందు హీరోను అల్లాటప్పాగా చూపించి.. ఒక దశ దాటాక అతను అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నట్లుగా చూపించడం ‘పోకిరి’తోనే మొదలైంది. ఇటీవలే విడుదలైన ‘లై’ సినిమాలో సైతం ‘పోకిరి’ స్ఫూర్తి కనిపిస్తుంది. ఇప్పుడు పూరి.. బాలయ్యతో తీసిన ‘పైసా వసూల్’ కూడా ఆ దారిలోనే సాగుతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘పైసా వసూల్’ ట్రైలర్ ఈ దిశగా హింట్ ఇచ్చింది కూడా.
రూత్ లెస్ గా మర్డర్లు చేసే క్రిమినల్ లాగా కనిపిస్తున్నాడు బాలయ్య ‘పైసా వసూల్’లో. ఐతే అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా బాలయ్య ఇలా విలన్ల పని పడతాడేమో అనిపిస్తోంది. తనకో కమీనా.. ఖతర్నాక్ కావాలంటూ ఓ వాయిస్ వినిపించడంతో మొదలవుతుంది ‘పైసా వసూల్’ ట్రైలర్. మధ్యలో ఈ ఆపరేషన్ కు వీడే సరైనోడు అన్న మాట కూడా వినిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే బాలయ్య అండర్ కవర్ ఏజెంట్ ఏమో అనిపిస్తోంది. ప్రధానంగా హీరో టిపికల్ క్యారెక్టరైజేషణ్ మీద కథను నడిపించి.. ఎంటర్టైన్ చేయడం పూరి బలం. మధ్యలో ఆ బలం కొంచెం సడలింది. బాలయ్య కోసం మళ్లీ తన బలాన్నే నమ్ముకున్నట్లున్నాడు. ట్రైలర్ అంతా కూడా పూరి మార్కు హీరో క్యారెక్టరైజేషన్.. డైలాగ్స్.. బాలయ్య దూకుడే హైలైట్ అయ్యాయి. ఐతే కేవలం వాటితోనే నెట్టుకొచ్చేస్తే కుదరదు. ఇంకేదో ప్రత్యేకత చూపిస్తేనే సినిమా అనుకున్న రేంజిలో ఆడుతుంది. మరి పూరి సినిమాలో ఆ ప్రత్యేకత చూపించాడేమో సెప్టెంబరు 1న చూద్దాం.