శ్రీమంతుడి కోసం డైరెక్టర్లు దిగుతున్నారు

Update: 2015-08-03 10:01 GMT

Full View
‘శ్రీమంతుడు’ వ్యవహారం ముందంతా నెమ్మదిగానే ఉంది కానీ.. రిలీజ్  దగ్గరపడేసరికి జోరు మామూలుగా లేదు. ప్రమోషన్ తో పిచ్చెక్కించేస్తున్నారు. ఓ పక్క హీరో మహేష్ బాబు, మరో పక్క హీరోయిన్ శ్రుతి హాసన్, ఇంకో పక్క డైరెక్టర్ కొరటాల శివ.. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలతో మోతెక్కించేస్తున్నారు. ఈ ప్రమోషన్ చాలదని ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు ఒక్కొక్కరినే దించుతున్నారు. శ్రీమంతుడు విషయంలో వాళ్లు ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారో చెప్పిస్తున్నారు.

మహేష్ కు మరపురాని సినిమాలందించిన పూరి జగన్నాథ్ శ్రీమంతుడు గురించి తనదైన శైలిలో మాట్లాడాడు. ‘‘నేను ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్న సినిమా శ్రీమంతుడు. ఎందుకంటే ఇది మా కృష్ణగారబ్బాయి, మా మహేష్ బాబు నటించిన సినిమా ఇది. మహేష్ సినిమా కోసం నేనే కాదు.. అందరూ ఇలాగే ఎదురు చూస్తారు. మహేష్ డైరెక్టర్లకు కిక్కిచ్చే హీరో. మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటాడు. నా ఫ్రెండు కొరటాల శివ.. మహేష్ తో పని చేయడం నాకు చాలా సంతోషం. శివ ఎప్పుడు కలిసినా మహేష్ బాబు గురించే మాట్లాడుతుంటాడు. శ్రీమంతుడు పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా. నా డార్లింగ్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ఒక పాట చేశాడు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నా మొగుడు.. అని. నేను కూడా ఆ మొగుడి కోసమే ఎదురు చూస్తున్నా’’ అని ముగించాడు పూరి. మరోవైపు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం శ్రీమంతుడి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. శ్రీమంతుడు చాలా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇంకా మరి కొందరు స్టార్ డైరెక్టర్లతో  కూడా సినిమాను ప్రమోట్ చేయించే ఉద్దేశంతో ఉన్నారట ప్రొడ్యూసర్లు. ఆ లిస్టులో త్రివిక్రమ్, శ్రీనువైట్ల, గుణశేఖర్ తదితరులున్నట్లు సమాచారం.
Tags:    

Similar News