పుష్ప 2 బ‌డ్జెట్ పారితోషికాల పెంపు?

Update: 2022-04-01 03:30 GMT
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ రేంజు ఇప్పుడు అమాంతం మారింది. ఇక బాలీవుడ్ తో స‌మానం లేదా అంత‌కుమించి అన్న చ‌ర్చ సాగుతోంది. దీనిని బాలీవుడ్ స్టార్ హీరోలు అంగీక‌రించేందుకు సిద్ధంగా లేక‌పోయినా కొన్ని వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. హిందీ ప‌రిశ్ర‌మ సృష్టించిన‌ స‌రిహ‌ద్దు రేఖ‌ను తుడిచేస్తూ దేశ స‌రిహ‌ద్దుల్ని దాటి తెలుగు సినిమా ఘ‌న‌విజ‌యం అందుకుంటోంది.

బాహుబ‌లి- సాహో చిత్రాలు బాలీవుడ్ లో బంప‌ర్ హిట్లు కొట్టాయి. ఇటీవ‌ల పుష్ప 1 అంతే పెద్ద స‌క్సెసైంది. త‌దుప‌రి వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉత్త‌రాదిన విడుద‌ల కానున్నాయి. ఇక వీటిలో బ‌న్ని న‌టిస్తున్న పుష్ప 2పైనా చాలా అంచ‌నాలేర్ప‌డ్డాయి.

అల్లు అర్జున్-  సుకుమార్ బృందం సీక్వెల్ కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్ లో మొద‌ల‌వుతుంద‌ని భావించినా కానీ అది డిలే అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ చర్చల్లో పాల్గొంటున్నాడు. పుష్ప:  ది రైజ్ ఉత్తర భారతదేశంలో అసాధారణమైన వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో ఇప్పుడు సీక్వెల్ పై మ‌రింత శ్ర‌ద్ధ‌గా ప‌ని చేస్తున్నారు.

మేకర్స్ ఇప్పుడు సీక్వెల్ బడ్జెట్ ను పెంచే ప‌నిలో ఉన్నార‌ట‌. బ‌న్ని- సుకుమార్ తమ పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి మేకర్స్ కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ కూడా విడుదలకు ముందే ఉత్తర భారతదేశంలో పుష్ప: ది రూల్ ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్లాన్ లో ఉన్నాడు.

అతను తన తండ్రి అల్లు అరవింద్ ను పుష్ప: ది రూల్ ఆర్థిక వ్యవహారాలలో పాలుపంచుకోవాలని కూడా కోరుకుంటున్నాడు. పుష్ప: ది రైజ్ నాన్-థియేట్రికల్ హక్కులు షూటింగ్ ప్రారంభం కాకముందే అమ్ముడయ్యాయి. విడుదలకు ముందే అమ్మితే మేకర్స్ కు భారీ లాభాలు వచ్చేవి. హిందీ థియేట్రికల్ వెర్షన్ ద్వారా గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ కు చెందిన మనీష్ భారీ లాభాలను ఆర్జించారు.

సీక్వెల్ కోసం బడ్జెట్ లు సవరించారు. పుష్ప: ది రూల్ కోసం సుకుమార్ పాపుల‌ర్ బాలీవుడ్ ముఖాలను వెతుకుతున్నాడ‌ట‌. బడ్జెట్ .. రెమ్యునరేషన్ ఇతర అంశాలపై మరో రెండు నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవ‌రూ  కంగారు ప‌డ‌డం లేదు. తొందరపడటం లేదు.
ప్ర‌తిదీ తాపీగా ఖరారు అయిన తర్వాత మాత్రమే షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. పుష్ప: రూల్ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే పారితోషికాలు బ‌డ్జెట్ పెంపు స‌రే కానీ కంటెంట్ ప‌రంగా సుకుమార్ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు! అన్న‌దే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ కానుంది. ప్ర‌స్తుత స‌న్నివేశంలో పారితోషికాల్లో రైజ్ ఎంత‌వ‌ర‌కూ అవ‌స‌రం అన్న‌ది బ‌న్నీ అండ్ టీమ్ తేల్చాల్సి ఉంది.
Tags:    

Similar News