ఈ మధ్య కాలంలో రచయితగా శ్రీకాంత్ విస్సా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వరుస సినిమాలకు ఆయన రచయితగా పనిచేస్తున్నాడు. 'పుష్ప' సినిమాకి ఆయన రాసిన డైలాగ్స్ ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. 'పార్టీ లేదా పుష్పా' .. 'పుష్ప' అంటే ఫ్లవరనుకుంటివా .. ఫైరూ' అనే డైలాగ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి. సాధారణంగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటూనే ఒక చమక్కు చూపించడం శ్రీకాంత్ విస్సా ప్రత్యేకత అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2 ' సినిమాకి పనిచేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.
'పుష్ప' సినిమాకి చాలా ఎంజాయ్ చేస్తూ మాటలు రాశాను. ఆ డైలాగ్స్ అంతగా పేలతాయని కూడా అనుకోలేదు. కొన్ని డైలాగ్స్ ను జనం బాగా గుర్తుపెట్టుకున్నారు. మరికొన్ని డైలాగ్స్ చిన్న పిల్లలు కూడా చెబుతున్నారు. అంతగా వారికి ఆ డైలాగ్స్ కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకి వచ్చిన గుర్తింపు ఉత్సాహంతో పాటు బాధ్యతను కూడా పెంచింది. అందువలన నా పై ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది. ఫస్టు పార్టు హిట్ కావడంలో డైలాగ్స్ కీలకమైన పాత్రను పోషించడం వలన, సహజంగానే సెకండ్ పార్టుపై అంచనాలు ఉంటాయి.
అందువలన నేను ఇప్పుడు మరింత కేర్ తీసుకుని పనిచేయవలసి ఉంటుంది. మరిన్నీ క్యాచీ లైన్స్ ఈ సినిమాలో ఉండేలా చూసుకుంటున్నాను. బన్నీగారి బాడీ లాంగ్వేజ్ .. యాసకి తగిన పంచ్ డైలాగ్స్ కోసం కష్టపడుతున్నాను. ఒక వైపున సుకుమార్ గారు .. మరో వైపున అల్లు అర్జున్ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వాళ్ల అంచలాకి తగినట్టుగా నా నుంచి అవుట్ పుట్ ఉండేలా చూసుకుంటున్నాను. ఈ సినిమా ఫస్టు పార్టుకి మించి ఉంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది " అని చెప్పుకొచ్చాడు.
రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో సునీల్ .. అనసూయ .. ఫహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సునీల్ శెట్టి కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. స్పెషల్ సాంగ్ లో దిశా పటాని అలరించనుందని అంటున్నారు.
కథాకథనాలు .. మాటలు .. పాటలు .. డాన్సులు .. ఫైట్లు ఎలా అన్ని విషయాల్లోను ఫస్టు పార్టుకు మించి అన్నట్టుగా సెకండ్ పార్టు ఉండేలా చూసుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.