‘బాహుబలి: ది కంక్లూజన్’ దెబ్బకు వేరే రాష్ట్రాల్లో లోకల్ సినిమాలు కూడా నిలవలేని పరిస్థితి. ఉత్తరాదిన హిందీ సినిమాలు.. దక్షిణాదిన కన్నడ.. తమిళం.. మలయాళ సినిమాలు కూడా ‘బాహుబలి-2’ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 జోరు గురించి చెప్పాల్సిన పని లేదు. రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోందా సినిమా. ఐతే ఈ సినిమా వచ్చిన వారానికే ‘బాబు బాగా బిజీ’ చిత్రాన్ని రిలీజ్ చేసే సాహసం చేశాడు నిర్మాత అభిషేక్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అడల్ట్ ముద్ర వల్ల కొంచెం ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. సినిమా ఏమీ నిలబడలేదు.
ఇక ఈ వారం ఒకటికి మూడు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘రాధ’ గురించి. వరుసగా నాలుగు హిట్ల తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ఇది. లావణ్య త్రిపాఠి లాంటి అందమైన హీరోయిన్ శర్వా సరసన నటించగా.. చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘రాధ’ మీద పాజిటివ్ బజ్ ఉంది కానీ.. ప్రమోషన్ పెద్దగా చేయకపోవడంతో అనుకున్నంత హైప్ రాలేదు. ఇది ‘గబ్బర్ సింగ్’ తరహా ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. ‘రాధ’ తర్వాత ప్రస్తావించాల్సిన సినిమా ‘వెంకటాపురం’. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ హీరోగా వేణు మడికంటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ తో బాగానే ఆసక్తి రేకెత్తించింది. ఇక రక్ష.. జక్కన్న లాంటి సినిమాలు తీసిన వంశీకృష్ణ రూపొందించిన ‘రక్షకభటుడు’ కూడా ఈ శుక్రవారమే విడుదలవుతోంది. దీనిపై ఏమంత అంచనాల్లేవు. మరి రెండో వారంలోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘బాహుబలి-2’ను తట్టుకుని ఈ మూడు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందో చూడాలి.