మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` రీలీజ్ డేట్ మరోసారి మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు విడుదల తేదీ విషయంలో రాజీపడిన `ఆర్.ఆర్.ఆర్` టీమ్ మరోసారి తమ సినిమా రిలీజ్ తేదీని వాయిదా వేయడం ఖాయంగా కనిపిస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా వార్తల నేపథ్యంలో `ఆర్.ఆర్.ఆర్` వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోందంటూ సోషల్ మీడియా వేదికగా పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా `ఆర్ ఆర్ ఆర్ ` రిలీజ్ డేట్ మారబోతోందని ఊహాగానాలు మొదలవ్వడానికి ప్రధాన కారణం మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనే అనే తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా మహా ప్రభుత్వం రాష్ట్రంలో థియేటర్ల రీ ఓపెన్ కి అనుమతులు ఇవ్వడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా థియేటర్లకు వెసులు బాటు కల్పించి రీఓపెన్ చేసినా మహా రాష్ట్రలో ఇంత వరకు ఎక్కడా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. అయితే తాజాగా థియేటర్లని అక్టోబర్ 22 నుంచి తెరుచుకోవచ్చని ప్రకటించడంతో బాలీవుడ్ లో మళ్లీ సినిమాల హంగామా మొదలైంది.
మహా ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన రాగానే చాలా వరకు నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా వున్న చిత్రాల కొత్త రిలీజ్ డేట్‌లని ప్రకటించేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో `ఆర్ ఆర్ ఆర్` మేకర్స్ కూడా తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చే అవకాశం వుందని తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ . దీనికి బాలీవుడ్ మార్కెట్ చాలా కీలకం. `బాహుబలి` తరువాత దేశ వ్యాప్తంగా రాజమౌళి సినిమాకు హ్యూజ్ మార్కెట్ తో పాటు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని `ఆర్ ఆర్ ఆర్` మేకర్స్ తమ సినిమా రిలీజ్ ని సంక్రాంతికి మార్చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ప్రభాస్ తను నటిస్తున్న `రాధేశ్యామ్`తో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. జనవరి 14న సంక్రాంతి రోజుని ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ వుండటం.. ప్రభాస్.. పూజా హెగ్డేల మధ్య వున్న కెమిస్ట్రీ..పిరియాడిక్ హెరిటేజ్ లవ్‌స్టోరీ వంటి బలమైన కారణాలతో సినిమాపై గట్టి నమ్మకంతో వున్న మేకర్స్ `ఆర్ ఆర్ ఆర్`కు పోటీగా `రాధేశ్యామ్`ని దించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులకు కొంత ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు.
`రాధేశ్యామ్`లో అంత ప్రత్యేకత ఏం ఉందని?
అత్యంత భారీ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తో పోటీపడేంతగా `రాధేశ్యామ్`లో ఏం ఉందని? అంటే చాలా మ్యాటర్ ఉందన్న టాక్ ఇటీవల పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ సినిమా మరో మైనే ప్యార్ కియా రేంజు అన్న ప్రచారం సాగుతోంది. `మైనే ప్యార్‌కియా`.. 1989లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం యావత్ భారతాన్ని ప్రేమలోకంలో విహరించేలా చేసింది. ఈ మూవీ ద్వారా పరిచయమైన భాగ్యశ్రీ తొలి చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. నటిగా క్రేజ్ వుండగానే సినిమాల నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ దాదాపు మూడు దశాబ్దాల అనంతరం మళ్లీ వెండితెర ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ పూజాలతో పాటు భాగ్యశ్రీ నటన కూడా ఇందులో హైలైట్ కానుందని సమాచారం.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ తన రీఎంట్రీ గురించి.. `రాధేశ్యామ్`లో తన పాత్ర గురించి.. ఆ పాత్ర ప్రాముఖ్యత గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. సినిమాలో తనది తల్లి పాత్ర కాదని.. చాలా కీలకమైన పాత్ర అని తెలిపింది. తన పాత్ర లేకపోలే సినిమా లేదని.. తన పాత్రని తీసేస్తే సినిమా మొత్తానికి ప్రాబ్లమ్ అవుతుందని అంత ముఖ్యమైన పాత్ర అని తెలిపింది భాగ్యశ్రీ. యూరప్ నేపథ్యంలో అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరి రాధేశ్యామ్.