బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే పేరు తెలియని సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. ఈ హాటు బ్యూటీ సౌత్ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. రాధిక తెలుగు సినిమాలలో కూడా నటించింది. ఇప్పటికే సౌత్ లో ఒక హీరో సినిమా షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కామెంట్లు చేసిన ఈ భామ తాజాగా మరోసారి అదే విషయాన్ని నో ఫిల్టర్ నేహ షో లో చెప్పింది. ఈ టాక్ షో హోస్ట్ అయిన నేహా ధూపియా "మీ కెరీర్ లో మీరు రెంట్ కట్టడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోలేక చేసిన వింత పని ఏంటి రాధికా?" అని అడిగితే "నేను సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ చేశాను(హాహాహ.. అని పెద్దగా వింతగా నవ్వుతూ). వాళ్ళు మంచి పేమెంట్ ఇస్తారు. మీరు ఆ డబ్బుకు అర్హులు(ఆ డబ్బు తీసుకున్నందుకు మీకు శాస్తి జరగాల్సిందే అన్నట్టుగా). అక్కడ చేయడం కష్టం.. చాలా కష్టం" అని చెప్పింది.
మరి అక్కడ సమస్య ఏంటి? స్త్రీ పురుష సమానత్వం లేదా?" అని నేహా అడిగితే "నేను సౌత్ అంతా అలా ఉందని జనరల్ స్టేట్మెంట్ ఇవ్వను.. కానీ నేను పనిచేసిన సినిమాల విషయానికి వస్తే మాత్రం.. ఉంది. 100% ఉంది. వాళ్ళు చాలా పవర్ఫుల్. మిమ్మల్ని రెండు గంటల ముందు పిలుస్తారు. అలా ఊరికే మీ చేత వెయిట్ చేయిస్తారు. మిమ్మల్ని వింతగా చూస్తారు. నేను పని చేసిన తెలుగు సినిమాలో మొదటి రోజు సీన్ లో భాగంగా పడుకున్నాను. అక్కడ చాలామంది ఉన్నారు. మేము ఆ సమయంలో రిహార్సల్ చేస్తున్నాము. అప్పుడు యాక్టర్ వచ్చాడు. అయన చాలా పెద్ద నటుడు. అయన పవర్ఫుల్ అని కూడా చెప్పారు. అయన నాకు చక్కలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. కానీ నేను వెంటనే రియాక్ట్ అయ్యి అరిచాను. క్రూ.. జూనియర్ ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉన్నారు. ఎప్పుడూ నాతో అలా చెయ్యొద్దు.. ఎప్పుడూ.. అని అరిచాను. ఆ సమయంలో నేను చాలా కోపంగా ఉన్నాను."
అప్పటి నుంచి మరోసారి ఎప్పుడూ అతను తనతో మిస్ బిహేవ్ చెయ్యలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు రజనీ కాంత్ సార్ తో చేసిన సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని.. అయన ఒక నైస్ పర్సన్ అని.. ఒక అద్భుతమైన మనిషి అని కితాబిచ్చింది. అంతా బాగానే ఉంది గానీ ఆ కాలుగోకిన మహానుభావుడు ఎవరో మీకు అర్థం అయిందా లేదా?