న్యూడ్ వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టాడని రాజ్ కుంద్రాపై మరో నటి ఫిర్యాదు
అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరింత చిక్కుల్లో పడ్డాడు. తాజాగా మరో నటి రాజ్ కుంద్రాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టడం సంచలనమైంది. సదురు నటి రాజ్ కుంద్రాపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే రాజ్ కుంద్రాపై కొందరు నటీమణుల నుంచి తీవ్రఆరోపణలు వచ్చాయి. తాజాగా మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల వీడియోలను, ఫొటోలను హాట్ షాట్స్ యాప్ లో విడుదల చేశారని ఆరోపిస్తూ ఈ నటి రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముంబై పోలీసుల ముందు ఆమె సంచలన నిజాలు బయటపెట్టినట్టు చెబుతున్నారు.
ఇటీవల మల్వాణీ పోలీస్ స్టేషన్ లో రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేసిన ఈ నటి తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు సమాచారం. ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసుకొని ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.
రాజ్ కుంద్రా మంచి వ్యక్తి కాదని.. తనకు ఇచ్చిన మాట తప్పి తన అశ్లీల చిత్రాలు హాట్ షాట్ యాప్ లో పెట్టాడని ఆ నటి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
‘ప్రైవేటు పార్ట్స్’ను వీడియోలో చూపించకూడదని షరతు ముందే పెట్టుకొని రాజ్ కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని.. అయితే తను ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఏ విధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోను హాట్ షాట్ యాప్ లో విడుదల చేశారని ఆ నటి ఆరోపించింది. ఓ స్నేహితుడి ద్వారా తనకు ఈ విషయం తెలిసి రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.
ఇప్పుడు మరో నటి ఫిర్యాదుతో రాజ్ కుంద్రా మరో కీలక మలుపు తిరిగింది. మరి మున్ముందు ఈ కేసు ఎటువైపు వెళుతుందనేది ఆసక్తి గా మారింది.