అశ్లీల వీడియోల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి దాదాపు రెండు వారాలు అవుతోంది. వారం రోజుల పాటు ఈ కేసు గురించి.. రాజ్ కుంద్రా గురించి కొత్త విషయాలు వెలువడుతూనే ఉన్నాయి. అశ్లీల వీడియోల పేరిట యువతులను బలవంతంగా రొంపిలోకి దించాడని రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసినప్పటి నుంచి అతడి ఆగడాలపై మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. రాజ్ కుంద్ర అరెస్ట్ కాగానే ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను నాశనం చేయించారని.. ఒక్క సాక్ష్యం కూడా లేకుండా చేశారని ముంబై హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ పాయ్ వాదించారు.
రాజ్ కుంద్రా వాట్సాప్ గ్రూపులు, చాట్ లను కూడా తొలిగించారని.. మొత్తం సాక్ష్యాలను నాశనం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాంబే హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా టెక్కీ అసోసియేట్ ర్యాన్ థోర్పే కూడా సాక్ష్యాలను తొలగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తన అశ్లీల వ్యాపారానికి కీలకమైన హాట్ షాట్ , బోలీ ఫేమ్ యాప్ లను అమలు చేస్తున్న రాజ్ కుంద్రా.. ఈ ఏడాది మార్చిలో తన ఫోన్ ను కూడా మార్చినట్టు వెల్లడైంది. అప్పుడు చేస్తారనే భయంతోనే అతడు తన పాత ఫోన్ ను కనిపించకుండా విసిరేశాడని సమాచారం. ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశారని.. కానీముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ రెండు యాప్ ల నుంచి 51 అశ్లీల సినిమాలను స్వాధీనం చేసుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.
యూకేలో కెన్నిన్ లిమిటెడ్ యజమాని అయిన అతడి బావ ప్రదీప్ బక్షికి రాజ్ కుంద్రా నుంచి ఒక ఈమెయిల్ కూడా రికవరీ చేయబడిందని తేలింది.
ఈ హాట్ షాట్ యాప్ లో అడల్ట్ పిల్మ్ కంటెంట్ ను అప్లోడ్ చేస్తున్నట్టు ఆధారాలు ఉండడంతోనే గత వారం బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.