మంచు విష్ణు - రాజ్ తరుణ్ లు హీరోలుగా నటించిన ఈడో రకం- ఆడో రకం మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మూవీలో మొదట ఒకే హీరో అనుకున్నా.. తర్వాత రాజ్ తరుణ్ కోసం స్టోరీ మార్చామని డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి ఇప్పటికే చెప్పాడు. అయితే. మంచు ఫ్యామిలీ హీరోతో సినిమా అంటే వాళ్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తాయి. వీటిపై స్పందించాడు రాజ్ తరుణ్.
"మంచు విష్ణుతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు నేను మొదట ప్రకటించగానే చాలామంది నాకు చాలా రకాలుగా చెప్పారు. మంచు ఫ్యామిలీ నీ కేరక్టర్ ని డామినేట్ చేసేలా ఉంటుందని అన్నారు. కానీ అందులో వాస్తవం లేదు. వాళ్లు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు' అని చెప్పాడు రాజ్ తరుణ్.
'విష్ణు చాలా ఓపెన్ మైండ్ ఉన్న వ్యక్తి. తను అద్భుతంగా నటించడమే కాదు.. సహ నటుల పెర్ఫామెన్స్ కు అవకాశం కల్పించడంలో విష్ణు సూపర్. మంచు కుటుంబం నన్ను తమ ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు' అన్నాడు రాజ్ తరుణ్. కన్ఫ్యూజన్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారికా భడోరియా - రాజ్ తరుణ్ కి జోడీగా హేభా పటేల్ నటించారు.