RRR విష‌యంలో SS రాజ‌మౌళి సీత‌య్య టైపే!

Update: 2021-09-19 17:30 GMT
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్.ఆర్.ఆర్` ని డెడ్ లైన్ ప్ర‌కారం పూర్తి చేసి రిలీజ్ చేయాల‌ని జ‌క్క‌న్న ప‌ట్టుద‌ల‌గా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇద్ద‌రు బిగ్ స్టార్లు రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా  పిన్ టూ పిన్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. `బాహుబ‌లి` విష‌యంలో జ‌రిగిన త‌ప్పిదాలు ఆర్.ఆర్.ఆర్ లో రిపీట్ కాకుండా ఎంతో జాగ్ర‌త్త తీసుకుంటున్నారు. తండ్రి స్టార్ రైట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ అందించిన క‌థకు కుమారుడు రాజ‌మౌళి అద్భుత‌మైన దృశ్య రూపాన్ని ఇస్తున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విష‌యంలో జ‌క్క‌న్న సీత‌య్య‌లాగే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు రామ్ చ‌ర‌ణ్ మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

బిగ్ బాస్ షో కు గెస్ట్ గా విచ్చేసిన రామ్ చ‌ర‌ణ్ ని హోస్ట్ నాగార్జున సినిమా విష‌యాల గురించి అడిగితే మీకెంత తెలుసో నాకు అంతే తెలిస‌ని మెహ‌మాటం లేకుండా చెప్పేసారు. కేవ‌లం న‌టులుగా త‌న‌ప‌ని తాను చూసుకున్నా ను త‌ప్ప సినిమాకు సంబంధించిన ఇంకే విష‌యాలు త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. చ‌ర‌ణ్ న‌టించిన ఒక్క సీన్ కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఎడిటింగ్ రూమ్ లో చూసుకోలేదుట‌.  దీనికి నాగార్జున  న‌వ్వుతూ రాజ‌మౌళి గారు చ‌ర‌ణ్ కి చెప్ప‌క‌పోయినా నాకైనా చెప్పండి.. ఇది మ‌రీ అన్యాయం అంటూ కెమెరాను చూస్తూ త‌న సందేశాన్ని జ‌క్క‌న్న‌కు పాస్ చేసారు. చర‌ణ్ మాట‌ల్ని బ‌ట్టి జ‌క్క‌న్న ఆర్.ఆర్.ఆర్ విష‌యంలో ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

ఈ సినిమాకు రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులు ఎక్కువ మంది ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎడిటింగ్ సంబంధించిన ప‌నులన్నిటికి రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ‌.. లైన్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోన్న కీర‌వాణి స‌తీమ‌ణి వ‌ల్లీ కంట్రోల్ లోనే మొత్తం అంతా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వాళ్ల‌కి కూడా జ‌క్క‌న్న సీరియ‌స్ గా ఎలాంటి అప్ డేట్స్ గానీ... సినిమాకు సంబంధించిన పూచిక పుల్ల కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశాలిచ్చారుట‌. అంతేకాదు ఈ సినిమాకి ప‌ని చేసిన జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు కూడా అంతే సీరియ‌స్ గా ఆదేశాలిచ్చార‌ని తెలిసింది. అందుకేనేమో చ‌ర‌ణ్ నాకెందుకులే అని త‌న ప‌ని తాను త‌ప్ప మిగ‌తా విష‌యాల్లో  ఎక్క‌డా వేలు కూడా పెట్టిన‌ట్లు లేదు. కొన్ని కొన్ని విష‌యాల్లో క్రియేట‌ర్స్ అంత ట‌ఫ్ గా ఉంటేనే మంచిది అన్న పాజిటివ్ వైబ్ కూడా వినిపిస్తోంది.
Tags:    

Similar News