‘బాహుబలి: ది బిగినింగ్’ను ఓ మోస్తరుగానే ప్రమోట్ చేసింది రాజమౌళి అండ్ కో. ఐతే షూటింగ్ డేస్ లో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వరకు తెలుగుకే పరిమితమయ్యాయి. సినిమా అంతా పూర్తయ్యాక కానీ మిగతా భాషల జోలికి వెళ్లలేదు. రిలీజ్ డేట్ ప్రకటించాక ముంబయి.. చెన్నై.. తిరునవంపురంలకు తిరిగారు. సినిమాను ప్రమోట్ చేశారు.
ఐతే ‘బాహుబలి: ది బిగినింగ్’ విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి తెలుగులో మరీ గొప్ప రివ్యూలేమీ రాలేదు. ప్రేక్షకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ‘బాహుబలి’ మీద విమర్శనాత్మక వార్తలు. కథనాలు కూడా బాగానే వచ్చాయి. కానీ తమిళం.. మలయాళం.. హిందీ భాషల్లో మాత్రం ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పేరుమోసిన క్రిటిక్స్ అందరూ మంచి రేటింగులిచ్చారు. దీనికి ప్రధాన కారణం.. అక్కడ సినిమా మీద అంచనాలు మరీ భారీగా లేకపోవడం.. బాహుబలి గురించి వాళ్లకు తక్కువ తెలవడం. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉంటుందని వాళ్లు అస్సలు ఊహించలేదు. సినిమా అంచనాలకు మించి ఉండటంతో బ్రహ్మరథం పట్టారు.
ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో అన్ని భాషల్లోనూ అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. విడుదలకు ఇంకా సంవత్సరం రోజులున్నా.. ఇప్పటికే హైప్ ఓ రేంజిలో ఉంది. ఈ అంచనాల్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ అంచనాలు.. హైప్ విడుదల సమయానికి మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. బాహుబలి టీం సినిమా గురించి ఒక్క మాట మాట్లాడకున్నా.. ప్రమోషన్ ఏమీ చేయలేకపోయినా వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఐతే ‘బాహుబలి’ నిర్మాతలు మాత్రం ఇప్పట్నుంచే హైప్ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
క్లైమాక్స్ షూటింగ్ తొలి రోజు అదే పనిగా అప్ డేట్స్ ఇవ్వడం.. సాయంత్రానికి రిలీజ్ చేసిన షార్ట్ వీడియో చూస్తే జనాలు బాగా ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇలా చేయడం వల్ల ‘బాహుబలి’కి కలిగే అదనపు ప్రయోజనం ఏంటన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సైలెంటుగా షూటింగ్ కానిచ్చేసి.. ఆ తర్వాత ప్రమోషన్ చేసుకుంటే బాగుంటుంది కానీ.. ఇంకా విడుదలకు ఏడాది ఉండగానే జనాల్లో ఎగ్జైట్మెంట్ పెంచడం.. వాళ్లను ఊరించడం వల్ల కొంత అసహనానికి గురయ్యే ప్రమాదముంది. ఇప్పటికే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న జనాల్ని వెర్రెత్తిస్తోంది. ఇక ఇప్పట్నుంచే ప్రమోషన్ ఇలా చేశారంటే జనాల ఎగ్జైట్మెంట్ కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి ‘బాహుబలి’ కొంచెం కాంగా ఉంటే బెటరేమో.