ఇండియాలో రేపిన ప్రకంపనలు సరిపోవని.. ఇప్పుడు చైనాలో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతోంది ‘బాహుబలి: ది బిగినింగ్’. చైనాలో ఓ లోకల్ సినిమా స్థాయిలో.. ఏకంగా 6500 స్క్రీన్లలో రిలీజవ్వబోతోంది మన జక్కన్న విజువల్ వండర్. ఇప్పటిదాకా చైనాలో అత్యధిక థియేటర్లలో రిలీజైన ఇండియన్ మూవీగా ‘పీకే’ పేరిట రికార్డుంది. ఆ సినిమా 6000 థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు బాహుబలి ఆ రికార్డును దాటేయబోతోంది. ఇంకా రిలీజ్ డేట్ కన్ఫమ్ కాలేదు కానీ.. ఈ నెలాఖరులోనో లేదంటే వచ్చే నెల ప్రథమార్ధంలోనో ‘బాహుబలి’ని విడుదల చేయడం ఖాయమని స్వయంగా రాజమౌళే చెప్పాడు. ఇండియాలో కంటే చైనాలోనే అత్యధిక థియేటర్లలో ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలవుతోందని ఓ నేషనల్ ఛానెల్ తో మాట్లాడుతూ జక్కన్న వెల్లడించాడు.
ఇక ‘బాహుబలి: ది కంక్లూజన్’ విశేషాల గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘బాహుబలి: ది బిగినింగ్ విడుదలైన మూడు నాలుగు నెలల్లోనే రెండో భాగం విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర ఆలస్యమవుతోంది. రెండో భాగం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ విషయంలో నేను ఒత్తిడిలో ఉన్నాననుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. నిజానికి ప్రేక్షకుల అంచనాలే ఒత్తిడిని దూరం చేస్తున్నాయి. రెండో భాగం ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్మకముంది. బాహుబలి విడుదలైనప్పట్నుంచి నన్ను ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అని లెక్కలేనంత మంది అడిగారు. ఆ ప్రశ్న నాకేమీ విసుగు తెప్పించట్లేదు. అది జనాలకు సినిమా మీద ఉన్న ఆసక్తికి నిదర్శనం. అన్ని భాషలవాళ్లూ ఈ ప్రశ్న అడగడాన్నిబట్టి ‘బాహుబలి’ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని అర్థమవుతోంది’’ అని చెప్పాడు.