రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి సినిమా వారం ముందే విడుదల కాబోతుంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట విడుదలకు సిద్దం అయ్యింది. పవన్ కళ్యాణ్ మరియు రానాలు కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే నిలిచింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ కు స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ స్క్రీన్ ప్లేను త్రివిక్రమ్ అందిస్తున్నాడు. ఇక సంక్రాంతి బరిలో నిలుస్తున్న మరో భారీ సినిమా ప్రభాస్ రాధే శ్యామ్. ఈ సినిమా కోసం రెండు మూడు ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ మూడు సినిమా లు కూడా సంక్రాంతికి వస్తున్నాయి. కనుక ఆర్ ఆర్ ఆర్ ను సంక్రాంతికి వారం ముందు విడుదల చేయబోతున్నారు. వారం ముందు విడుదల అయినా కూడా ఖచ్చితంగా ఆ మూడు సినిమాలతో పాటు ఆర్ ఆర్ ఆర్ కు కూడా ఎఫెక్ట్ ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాజమౌళి తాజాగా స్పందించాడు. ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో భాగంగా ఒక జర్నలిస్ట్ సంక్రాంతికి ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది కదా పోటీ ఎంత వరకు ఉంటుంది అంటూ ప్రశ్నించారు. అందుకు రాజమౌళి స్పందిస్తూ పోటీ అనేది ప్రతి సందర్బంలో కూడా ఉంటుంది. ప్రేక్షకులు మంచి సినిమాలను మంచి కంటెంట్ సినిమాలను ఆధరిస్తూ ఉంటారు. ఈసారి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కనుక అన్ని సినిమాలు బాగా ఆడాలి.. ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆధరించాలని కోరుకుంటున్నాం అంటూ రాజమౌళి తనదైన శైలిలో నవ్వుతూ సమాధానం ఇచ్చేశాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా జోరు చూస్తుంటే కనీసం రెండు వారాలు అయినా బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆర్ ఆర్ ఆర్ విడుదల అయిన తర్వాత రెండు వారాల వరకు మరే సినిమా విడుదల కాకుండా ఉంటే కచ్చితంగా బాహుబలి రికార్డులను జక్కన్న బ్రేక్ చేస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది. కాని మూడు పెద్ద సినిమా లు సర్కారు వారి పాట.. రాధే శ్యామ్ మరియు భీమ్లా నాయక్ లు విడుదల అవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అలా అని ఆ మూడు సినిమాలు కుమ్మేస్తాయా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వారం దాటినా కూడా ఆర్ ఆర్ ఆర్ నుండి గట్టి పోటీని ఆ సినిమాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఆర్ ఆర్ ఆర్ కు సైడ్ ఇచ్చేందుకు ఆ మూడు సినిమాల్లో కనీసం ఒక్కటి రెండు అయినా తప్పుకునే అవకాశం ఉందంటున్నారు. జనవరి కి ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఏమైనా జరగవచ్చు.