చైనాకి వెళుతున్న `బాహుబ‌లి`

Update: 2015-07-11 23:56 GMT
ఓవ‌ర్సీస్‌లో స‌రికొత్త రికార్డులు సృష్టించింది `బాహుబ‌లి`. అత్య‌ధికంగా అమెరికా నుంచే వ‌సూళ్లొచ్చాయి. అక్క‌డున్న భార‌తీయ ప్రేక్ష‌కులే ఎక్కువ‌మంది సినిమాని చూశారు. కానీ అంత‌ర్జాతీయ స్థాయిలో అంద‌రికీ బాహుబ‌లిని చేరువ చేయాల‌ని  చిత్ర‌బృందం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇంగ్లీష్ సినిమాల త‌ర‌హాలో బాహుబ‌లిని మ‌రింత ట్రిమ్ చేసి వివిధ దేశాల్లో విడుద‌ల చేయ‌డంపై ఇప్పుడు రాజ‌మౌళి దృష్టి కేంద్రీక‌రించారు. ముఖ్యంగా బాహుబ‌లిని చైనాకి తీసుకెళ్ల‌డంపై జోరుగా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల అమీర్‌ఖాన్ `పీకే` చైనాలో వంద‌కోట్లు వ‌సూళ్లు సాధించింది. ఆ లెక్కన భార‌తీయ చిత్రాల‌కి అక్క‌డ ఎంత ఆద‌ర‌ణ ల‌భిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. 

ముందు నుంచీ చైనా మార్కెట్‌పై దృష్టిపెట్టిన రాజ‌మౌళి అక్క‌డ `బాహుబ‌లి`ని విడుద‌ల చేయ‌డం కోసం అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తున్నాడు. 2.30గంట‌ల‌కు పైగా నిడివి ఉన్న సినిమాని బాగా ట్రిమ్ చేసి ఓవ‌ర్సీస్ వ‌ర్ష‌న్‌ని విడుద‌ల చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. విదేశాల్లో పెద్ద‌యెత్తున సినిమాని విడుద‌ల చేసేందుకు ఇదివ‌ర‌కే ఓ ప‌క్కా ప్ర‌ణాళిక‌ని సిద్ధం చేసుకొంది బాహుబ‌లి బృందం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కి వెళ్లి అక్క‌డ ట్ర‌యిల‌ర్‌ని చూపించి వ‌చ్చారు. ఇప్పుడు సినిమా సాధిస్తున్న వ‌సూళ్లు చూసి విదేశీ బ‌య్య‌ర్లు సినిమాని మాకు త‌గిన‌ట్టుగా సిద్ధం చేయ‌మ‌ని రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఇదివ‌ర‌కు ఆయ‌న తీసిన `ఈగ‌` కూడా ప‌లు దేశాలు చుట్టొచ్చింది. ఇప్పుడు బాహుబ‌లి కూడా అదే స్థాయిలో విజృంభించే అవ‌కాశాలున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News