'బాహుబలి' విజయం అనేది తెలుగు వారిని ఎంత సంతోష పెట్టిందో చాలామంది బాలీవుడ్ మేకర్స్ లో అంత అసూయను రగిలించింది. పోటీగా కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు కూడా. ఇక తమిళ ప్రేక్షకులు బాహుబలి ని ఆదరించినా కొంతమందికి మాత్రం వారిని టాలీవుడ్ దాటి వెళ్ళి పోయిందనే ఒక ఇన్ సెక్యూరిటీ కలిగింది. శంకర్ లాంటి దర్శకుడు కూడా 'అంతకు మించి' అనే కాన్సెప్ట్ తోనే 'బాహుబలి' ని దాటేందుకు '2.0' తో వస్తున్నాడు. సౌత్ సినిమాల రేంజ్ ని ఎప్పుడో పతాక స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా ఎంతో మంది యువ దర్శకులకు ప్రేరణనిచ్చిన టాలెంటెడ్ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు మరీ చీప్ గా 'ఇన్ సెక్యూరిటీ' అనే పదం వాడలేం కానీ... పోటీ తత్త్వం అనుకోవచ్చు.
'బాహుబలి' మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేయగలిగిన సత్తా ఈ సినిమాకు ఉందని చాలా మంది నమ్ముతున్నారు. నిజంగా కూడా 'బాహుబలి' తో పోలిస్తే '2.0' రేంజ్ అన్నీ విషయాలో ఎక్కువే. బడ్జెట్ విషయయమే చూసుకుంటే బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్. అంది 400 కోట్లా లేదా 500 కోట్లా అన్నది పక్కన బెడితే బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్ అన్నది నిర్వివాదాంశం.
లీడ్ యాక్టర్స్ చూసుకుంటే.. ప్రభాస్ కంటే రజనీ ఎంతో పెద్ద స్టార్. ఇక బాహుబలి కి హిందీలో అసలు ఏమాత్రం అప్పీల్ లేదు. కానీ '2.0' కు కొండ లాంటి అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఖాన్ లకున్న స్టార్ డమ్ అక్షయ్ కు లేకపోవచ్చు గానీ నార్త్ లో అయన చాలా పెద్ద స్టార్. నిజం మాట్లాడుకుంటే రజనీ ఫేస్ కంటే అక్షయ్ ఫేస్ చూసి చాలామంది నార్త్ లో సినిమాకు వెళ్తారు.
వీటన్నిటికీ తోడుగా టెక్నాలజీ. టూ పాయింట్ మ్యాజిక్ 3D లో ఉంటుందని ఇప్పవరకూ శంకర్ చెప్పుకొస్తున్నాడు. దానికి తోడుగా వీలైనన్ని థియేటర్స్ లో 4D సరౌండ్ సాండ్ లో సినిమా ను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 'బాహుబలి 2' 6500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. కానీ 6600 -6800 స్క్రీన్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పైగా ఈ సినిమాకు ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎందుకంటే రోబో అన్ని భాషల్లో సూపర్ హిట్. సో.. దీన్ని సీక్వెల్ గానే అందరూ పరిగణిస్తున్నారు. ఆ బ్రాండ్ వ్యాల్యూ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి. ఏ విషయంలో చూసుకున్నా 'అంతకు మించి'. అపరిచితుడి ఒరిజినల్ భాషలో పంచ్ డైలాగ్ చెప్పుకుంటే 'అదుక్కుం మేలె'.
అన్నీ ఎక్కువే. కానీ ఇపుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే.. రిజల్ట్ కూడానా? అది మనకు నవంబర్ 29 సాయంత్రానికి తేలే అవకాశం ఉంది.