కమల్ గుమ్మం ముందు రజనీ..

Update: 2016-11-16 10:45 GMT
హీరోల గురించి ఫ్యాన్సే కొట్టుకుంటారు- కానీ హీరోలు మాత్రం ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటారు. ప్రతీ విషయంలో కల్పించుకోని మరీ సాయాలు- గట్రా చేసుకోకపోయినా కావాల్సిన టైంలో మాత్రం ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకుంటారు. చాలాకాలం తర్వాత రజనీకాంత్- కమల్ హాసన్ మధ్య జరిగిన మీటింగ్ చూస్తే అది నిజమేనని మరోసారి అనిపిస్తోంది.

తలైవార్ రజనీకాంత్- ఉళగ నాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ ఇద్దరే. తమిళ సినిమా పరిధిని పెంచడంలో వీళ్ల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆన్ స్క్రీన్ లో కలిసి నటించడమే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ మంచి మిత్రులే. అయితే ఈ మధ్య ఆప్తమిత్రులిద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. కొచ్చడయాన్ మూవీ దగ్గర్నుంచి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో తరచూ చికిత్స కోసం విదేశాలు తిరుగుతున్నారు రజనీకాంత్. అంతా బాగైంది అనుకున్న టైంకి మొన్నటికి మొన్న హెల్త్ ఇష్యూ రావడంతో 2.0 షూటింగ్ మధ్యలోనే అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకొచ్చారు. ఇక శభాష్ నాయుడు తీస్తోన్న సమయంలో కమల్ హాసన్ గాయపడ్డారు. జారి పడటంతో కాలుకి సర్జరీ చేయించుకోని రెస్ట్ తీసుకుంటున్నారు కమల్.

రజనీకి ఆరోగ్యం బాలేనప్పుడు తన మిత్రుడు త్వరగా కోలుకోవాలంటూ కమల్ లేఖలు రాస్తే.. పరామర్శించడానికి రజనీ ఏకంగా అళ్వార్ పేటలో ఉన్న కమల్ ఇంటికి వచ్చేశారు. రజనీ వచ్చాడన్న విషయం తెలుసుకొన్న కమల్ స్వయంగా వెళ్లి ఆహ్వానం పలికారు. ఇక గ్యాప్ తర్వాత కలుసుకొన్న ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఎమోషనల్ అయిపోయారట. ఒకరి క్షేమం మరొకరు కనుక్కోని రిలాక్స్ అయ్యారట . నిజానికి రజనీ- కమల్ గురించి ముందు ఎవరికీ తెలియదు. అయితే ఆ టైంలో అక్కడే ఉన్న తూంగావనం డైరెక్టర్ కమ్ కమల్ శిష్యుడైన రాజేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో టాప్ హీరోల మీటింగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ఎలా తెలిస్తే ఏమీ స్టార్ హీరోలిద్దరూ ఒకరి గురించి మరొకరు జాగ్రత్త తీసుకోవడం మాత్రం ఫ్యాన్స్ కి భలే నచ్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News