సినిమా కోసం క్యారెక్టర్ కు తగినట్లుగా మారడం హీరోల దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్లు ఈ విషయంలో చొరవ తీసుకుని షార్ట్ టెర్మ్ లో సైజులు మార్చుకునేందుకు అంతగా సంసిద్ధత వ్యక్తం చేయరు. ఒకవేళ తగ్గేందుకు ఒప్పుకున్నా అందుకు తగినంత సమయం తీసుకుంటారు.
కానీ రకుల్ ప్రీత్ మాత్రం తన కొత్త సినిమా కోసం అతి దగ్గరగానే పెద్ద టార్గెట్ ను పెట్టుకుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న ఈ భామ.. ఇప్పుడు అజయ్ దేవగన్ తో ఓ మూవీలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ ఆ చిత్రం కోసం అమ్మడు బాగా తగ్గాల్సి ఉంటుందట. ప్రస్తుతం ఆమె ఉన్న బరువు నుంచి 9-10 కిలోల మేర బరువు తగ్గించుకుంటానని చెప్పిందట రకుల్ ప్రీత్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా 45-50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోగానే రకుల్ తన సైజ్ ను బరువును తగ్గించునేందుకు తెగ కష్టపడిపోతుందట రకుల్ ప్రీత్ సింగ్.
రోజుకు 4-5 గంటల పాటు వర్కవుట్స్ చేస్తున్నానని.. అందుకు తగినట్లుగానే డైట్ తీసుకుంటున్నానని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. తాను ఎక్సర్ సైజ్ లు చేయడంలో ఏ మాత్రం అలసట ఫీల్ కానని చెబుతోంది. ఒత్తిడిగా ఉన్నా.. సంతోషంగా ఉన్నా.. ఎలాంటి పరిస్థితిలో అయినా వర్కవుట్స్ చేయడం ద్వారా రిలాక్స్ అవుతానంటున్న రకుల్ ప్రీత్.. రాబోయే నెలన్నరలో 9 కిలోల బరువు కచ్చితంగా తగ్గుతానని చెబుతోంది.