ప్రకృతికి వాళ్లు.. వీళ్లు అన్న తేడా ఉండదన్న విషయం మరోసారి రుజువైంది. వాతావరణానికి రకుల్ దొరికిపోయారు. రకుల్ లాంటి టాప్ స్టార్ అయినప్పటికీ వాతావరణం సరిగా లేని కారణంగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. గురువారం నాటి నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షం కారణంగా ముంబయి మహానగరంలో జన జీవనం స్తంభించిపోయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ముంబయి రోడ్లు అన్ని తటాకాల్ని తలపిస్తుంటే.. వర్షపు నీరు కారణంగా ఎయిర్ పోర్ట్ లోకి మూడు అడుగుల పొడుగు ఉన్న చేపలు వచ్చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన రకుల్.. వర్షం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవటంతో ఆమె ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయారు.
ఇదిలా ఉంటే.. ముంబయి ఎయిర్ పోర్ట్ తెరిచి ఉందో లేదో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబయి పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి రకుల్ బదులిచ్చారు. సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా విమానాశ్రయం నుంచి కదల్లేదని.. తాను ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయినట్లుగా వెల్లడించారు.
దీంతో.. రకుల్ ప్రీత్ సింగ్ ఎయిర్ పోర్ట్ లోనే రాత్రంతా ఉండిపోయిన విషయం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే..ముంబయిలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చూస్తుంటే.. ముంబయికి మరిన్ని కష్టాలు తప్పేట్లు లేవు. పాపం రకుల్.. ఎయిర్ పోర్ట్ నుంచి తాను వెళ్లాలనుకున్న ప్లేస్ కు ఎప్పుడు వెళుతుందో ఏమో?