కధ దొరికితే .. నాన్న- నేను - బాబాయ్

Update: 2015-10-15 04:55 GMT
 మల్టీ ప్లెక్స్ ల సంస్కృతీ మాదిరి గానే మల్టీ స్టారర్ ల సంస్కృతి రోజు రోజుకీ మన తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఫ్యామిలీ బేస్ లు ఎక్కువ గాబట్టి, ఒకే ఫ్యామిలీనుండి వచ్చిన హీరోలంతా కలిసి నటించే మల్టీ స్టారర్ ఇప్పుడు నయా ట్రెండ్. ముందుగా దీనికి మంచు ఫ్యామిలీ పాండవులు పాండవులు తుమ్మెద సినిమాతో శ్రీకారం చుట్టారు. ఆ తరువాత అక్కినేని వంశం 'మనం' సినిమాతో ఈ ట్రెండ్ ని చారిత్రాత్మకంగా మలిచారు. కృష్ణ , మహేష్ - మహేష్, గౌతం లు ఇప్పటికే కలిసి నటించేశారు.

ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ కూడా తామంతా కలిసి ఒక సినిమా లో నటించే యోచనలు వున్నాయట. ఇక మిగిలిన పెద్ద ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నే. ఈ కాంబినేషన్ గనుక తెరకెక్కితే సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతుంది.

ఈ విషయంపై చరణ్ ని ప్రస్తావించగా నాన్న, నేను కళ్యాణ్ బాబాయ్ కలిపి ఒక సినిమాలో నటించడానికి సిద్ధమే.. అయితే దానికి ధీటైన కధ కావాలి. అటువంటి కధతో ఏ దర్శకుడు వచ్చినా మేము సానుకూలంగానే స్పందిస్తామని తెలిపారు.
Tags:    

Similar News