'సైరా' విషయంలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్ చరణ్ ఈ సినిమాను నిర్మించడం. అవును అక్టోబర్ 2న థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్న 'సైరా' సినిమాను తన తండ్రితో భారీ ఎత్తున నిర్మించి కెరీర్ లో ఎపిక్ సినిమాగా మలిచిన చరణ్ ను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. చిరు కూడా ప్రతీ ఈవెంట్ లో చరణ్ తనకి గర్వకారణమని, ఈ సినిమాను ఎంతో గొప్పగా నిర్మించాడని, ఇక తన జీవితంలో సాధించిన అతిపెద్ద విజయం చరణే అంటూ చెప్తున్నారు కూడా.
నిజానికి టాలీవుడ్ లో ఓ కొత్త పంథాకి తెర లేపాడు మెగా పవర్ స్టార్. చాలా మంది నిర్మాతలు కొడుకులను హీరోగా నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తుంటే చరణ్ తన తండ్రి కలను నెరవేర్చడం కోసం నిర్మాతగా అవతారమెత్తి 'సైరా'ను నిర్మించాడు. ఇక టాలీవుడ్ లో ఈ అవకాశం కూడా ఒక చరణ్ కె లభించింది. అందుకే రిలీస్ తరవాత కూడా చిరు, సురేందర్ రెడ్డి ల తర్వాత అందరూ చరణ్ నిర్మాణ విలువల గురించి అలాగే తను తండ్రికి అందించిన బహుమతి గురించే మాట్లాడతారని అనిపిస్తుంది.
ప్రస్తుతం ప్రమోషన్స్ ను ముగించుకొని రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నారు సైరా టీమ్. ఎలాగైనా ఈ సినిమాకు భారీ వసూళ్లు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా సినిమా ఏ మాత్రం బాగున్నా మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరి సైరా ఎలాంటి విజయం సాధిస్తుందో..? కమర్షియల్ గా చరణ్ ఎలా సక్సెస్ అందుకుంటాడో చూడాలి.