గత కొన్నేళ్లలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. మన దర్శకులు ఆలోచన నిర్మాతల నమ్మకం - ధైర్యం టాలీవుడ్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. ఇతర ఇండస్ట్రీలో కూడా మన సినిమాలు అనువాదం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే గత కొన్నేళ్ల క్రితం మన తెలుగు ఇండస్ట్రీలో మార్కెట్ కి తగ్గట్టుగానే సినిమాల బడ్జెట్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేవు. మారుతున్న కాలానికి కి తోడుగా టాలీవుడ్ కూడా అభివృద్ధి చెందుతోంది.
ఈ విషయాన్ని రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ ఇంకా అభివృద్ధి చెందే దిశగా చేయడం తమ బాధ్యత అని చెర్రి వివరించారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఆలోచనాలతో ముందుకు వెళుతోంది. కొత్త ఆలోచనలతో వచ్చిన వారికి ఇక్కడ అవకాశాలు ఎపుడైనా ఉంటాయి. గత కొన్నేళ్లుగా చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. అన్ని విషయాల్లో ఒక క్రమబద్ధీకరణ లో డెవలప్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా సినిమా ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందుకు వెళ్లేలా తాము ప్రయత్నిస్తామని చరణ్ తెలిపారు. ఈ విషయాన్ని చరణ్ ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం మెగా స్టార్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాకి కూడా అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సురేందర్ రెడ్డి ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో అలాగే లండన్ లోని ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన సెట్స్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.