149.5 అంటగా.. అంతా చరణ్‌ చేసిందే

Update: 2015-10-04 03:44 GMT
వికీపీడియా.. దీనిలో ఉన్నదంతా నిజం అని నమ్మలేం కాని.. దాదాపు అందరూ కష్టపడి నిజాలు రాయడానికే ప్రయత్నిస్తుంటారు. రిజిష్టర్‌ చేసుకొని ఎవరైనా ఏదైనా ఫిల్‌ చేసేయవచ్చు. సరిగ్గా ఇప్పుడు మెగా ఫ్యాన్సు అదే పని చేశారా అంటే అవుననే అంటున్నారు.

ప్రస్తుతం అందరి కళ్ళూ మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ''150''వ సినిమా మీదనే ఉన్నాయ్‌. అయితే సడన్‌ గా మధ్యలో రామ్‌ చరణ్‌ ఎంటర్‌ అయ్యి.. డాడ్‌ చిరంజీవిని 'బ్రూస్‌ లీ' సినిమాలో ఒక క్యామియో రోల్‌ చేయమని అడిగాడు. కాదనలేని చిరంజీవి మొహమాటంగానే ఒప్పేసుకున్నాడు. 150వ సినిమాకు ట్రైలర్ లా ఉంటుందని చెప్పి శ్రీను వైట్ల కూడా బాగానే కన్విన్స్‌ చేసేశాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాని 149 సినిమాలు చేసిన చిరంజీవి.. ఇప్పుడు ఇలా క్యామియో చేసేస్తే.. అది 150వ సినిమానే కదండీ అయ్యేది?

అందుకే వికిపీడియాలో మనోళ్ళు ఈ ''బ్రూస్‌ లీ'' సినిమా క్యామియోను 149.5వ సినిమా అంటూ మార్చేశారు. ఇదంతా ఫ్యాన్సుకు బాధగా.. సినిమా లవర్ లకు  కామెడీగా ఉంటుంది. అయితే ఇదంతా చరణ్‌ చేసిన ఘనకార్యమే మరి. మనోడు కనుక బ్రూస్‌ లీ లో క్యామియో చేయమని అడిగుండకపోతే అసలు వికీపీడియాను రీరైట్‌ చేసుండాల్సిన అవసరం వచ్చేది కాదు.
Tags:    

Similar News