అసలు ఈ ఫ్లాప్‌కి కార‌ణ‌మేమిటో.. చించుకున్న డైరెక్ట‌ర్!

సినిమా క‌థాంశం బావుంది.. కంటెంట్ బావుంద‌ని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అయినా కానీ థియేట‌ర్ల‌లో ఆశించిన వ‌సూళ్లు ద‌క్క‌లేదు.

Update: 2025-01-31 11:30 GMT

సినిమా క‌థాంశం బావుంది.. కంటెంట్ బావుంద‌ని క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అయినా కానీ థియేట‌ర్ల‌లో ఆశించిన వ‌సూళ్లు ద‌క్క‌లేదు. బాక్సాఫీస్ వైఫ‌ల్యాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. క‌నీసం ఓటీటీలో అయినా ఆద‌ర‌ణ ద‌క్కించుకుందా? అంటే అక్క‌డ కూడా బిగ్ ఫ్లాప్. మొత్తానికి షుజీత్ సిర్కార్ - అభిషేక్ బ‌చ్చ‌న్ కాంబినేష‌న్ మూవీ `ఐ వాంట్ టు టాక్` పెద్ద తెర‌, ఓటీటీలో ఫ్లాప్ గా మిగిలింది. ఇది షుజీత్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. తాను దిక్కుతోచని స్థితిలో ఉన్నానని , ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఎక్క‌డ విఫ‌ల‌మ‌య్యానో అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న చెందాడు.

ఆంగ్ల టైటిల్స్... బ‌హుభాష‌ల్లో విడుద‌ల ప్లాన్ కార‌ణంగా.. కొన్ని స‌మ‌స్య‌లున్నాయ‌ని అత‌డు అంగీక‌రించాడు. అమితాబ్ కి ఈ సినిమా న‌చ్చింద‌ని ప్ర‌శంసించారు. సినిమాలో కంటెంట్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. కానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారి ఏదో ఒక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డ‌టం న‌చ్చి ఉండ‌చ‌కపోవ‌చ్చ‌ని ఒక డౌట్ అలానే ఉంది.

ఇటీవ‌ల భార‌తీయ సినిమా రూట్ మారింది. క‌రోనా మ‌హ‌మ్మారీ త‌ర్వాత ఆడియెన్ ఆలోచ‌న మారింది. ఇప్పుడు ఓటీటీలు, బుల్లితెర హ‌వా కూడా అంత‌కంతు పెరుగుతోంది. ఓటీటీలు క్లిక్క‌య్యాక‌, భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్లు, ఎమోష‌న‌ల్ గా ఎగ్జ‌యిట్ చేసే సినిమాల‌ను మాత్ర‌మే ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌లో వీక్షిస్తున్నారు. ఏదైనా సంథింగ్ స్పెష‌ల్ ఉందంటేనే టికెట్లు కొని థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు మార‌క‌పోతే అది స‌మ‌స్యాత్మ‌కంగా మారుతుంది. మారిన ప్రేక్ష‌కుల అభిరుచిని ప‌ట్టుకోవ‌డంలో అభిషేక్- షూజిత్ బృందం విఫ‌ల‌మైంద‌ని కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెర‌పై సినిమా చూస్తున్నంత సేపూ భావోద్వేగానికి గుర‌వ్వ‌క‌పోతే ఆడియెన్ నిర్ధ‌య‌గా తిర‌స్క‌రిస్తున్నారు. కుర్చీ అంచుమీద‌కు జారి చూసేలా, ఇంటెన్స్ కంటెంట్ కూడా పెద్ద‌తెర‌కు చాలా అవ‌స‌రం.

అలాగే తెర‌పై క‌నిపించే హీరో ఎవ‌రు? అన్న‌ది కూడా కొన్నిసార్లు కీల‌కంగా మారుతోంది. కంటెంట్ బాగా వ‌ర్క‌వుట్ అయిన‌ప్పుడు మాత్ర‌మే హీరో ఎవ‌రు? అన్న‌ది చూడ‌టం లేదు. కంటెంట్ లో లోపం ఉంటే అది అంత‌గా క్రేజ్ లేని హీరోలకు మైన‌స్ గా మారుతోంది. అలాంటి ఒక స‌మ‌స్య‌ను ఫేస్ చేసాడేమో ద‌ర్శ‌కుడు షూజిత్ స్వ‌యంగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. కొంద‌రు హీరోలు ఓటీటీల‌కు మాత్ర‌మే సూట‌బుల్. పెద్ద తెర‌కు అంత‌గా స‌రిపోక‌పోవ‌చ్చేమో కూడా ఆలోచించాలి.

Tags:    

Similar News