చరణ్ ఇంత ఓపెన్ అయ్యాడేంటి ?

Update: 2019-01-06 05:46 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామతో సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్నాడు. అభిమానుల అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉండగా ట్రైలర్ చూసాక సాధారణ ప్రేక్షకులు ఇది రెగ్యులర్ బోయపాటి ట్రేడ్ మార్క్ సినిమాలా ఉందే అని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎవరో ఎందుకులెమ్మని చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చేసాడు. ఇది మరీ కొత్తగా ఏమి ఉండదని ఇలాంటి మసాలా పాత్రలు సీన్లు ఇంతకు ముందు చేసానని అయితే మా ఇద్దరి కాంబోలో ఇది రావడమే కొత్తని తేల్చి చెప్పేసాడు. శీను స్టైల్ లో తనకు అలవాటు లేని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం మాత్రం కొత్తగా ఉంటుందని కష్టపడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.

సో వినయ విధేయ రామ ముందు నుంచి ఊహించినట్టు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు మరోసారి స్పష్టత వచ్చేసింది. అయితే చరణ్ ఇలా చెప్పడం ఒకందుకు మంచిదే. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అదే తరహాలో ఇందులో కూడా చాలా వినూత్నత ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకుంటే అవి వేరే రకంగా ఫలితాన్నిఇవ్వొచ్చు. అది గుర్తించే చరణ్ ముందుజాగ్రత్తగా ఇలా  ప్రిపేర్ చేస్తన్నాడన్న మాట. అసలే తీవ్రమైన పోటీ మధ్య వస్తుండటంతో వినయ విధేయ రామ మీదే ట్రేడ్ పెట్టుబడులు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఏముంటాయో ముందే తెలిసి దానికి సన్నద్దమై వెళ్తే నిరాశ కలిగే ఛాన్స్ ఉండదు.

అలా కాకూండా ఇదేంటి ఇంతకు ముందు చూసిన సీన్లు ఇందులో కూడా ఉన్నాయే అని ఫీలవ్వకుండా ఇది ముందస్తు ఫీలర్ గా చెప్పొచ్చు. నేపాల్ బీహార్ బోర్డర్ లో వచ్చే కొన్ని సీన్స్ కోసం అజర్ బైజాన్ వెళ్లామని అంతే తప్ప ఆ దేశానికి కథకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పాడు. సో వినయ విధేయ రామలో కావాల్సినన్ని మాస్ మసాలాలు ఉంటాయని చరణ్ చెప్పేసాడు కాబట్టి అంత కంటే ఎక్కువగా మరీ ముఖ్యంగా రంగస్థలంను దృష్టిలో ఉంచుకోకుండా సంక్రాంతి సినిమాగా చూస్తే వినయ విధేయ రామ ఎంటర్ టైన్మెంట్ కి గ్యారెంటీ ఇచ్చినట్టే





Full View
Tags:    

Similar News