మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెప్పి ఏడాది కావస్తోంది. స్టోరీ సెట్ అయితే ముహూర్తం పెట్టేయడమే అని చెప్పి ఆరు నెలలు గడిచిపోయింది. అయితే.. ఇప్పటివరకూ ఎంతమంది ఎన్ని కథలు వడ్డించినా.. చిరుకి మాత్రం నచ్చలేదు. టాలీవుడ్ లో ఇంత నాణ్యత లేని రైటర్స్ ఉన్నారా అంటూ.. చిరంజీవి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారట.
గతంలో మెగాస్టార్ యండమూరి వీరేంద్రనాథ్ - సత్యానంద్ - పరుచూరి బ్రదర్స్ వంటి దిగ్గజ కథకులతో కలిసి పని చేశారు. ఇప్పుడు రీఎంట్రీ కోసం ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చిన చిరు చాలామంది చెప్పిన స్టోరీస్ విన్నారు. పూరీ జగన్నాథ్ - కోన వెంకట్ - ఆకుల శివ - పరుచూరి బ్రదర్స్ - చిన్ని క్రిష్ణ.. ఇలా బోలెడు మంది చెప్పిన కథల్లో.. ఆయనకు ఒక్కటి చకూడా నచ్చలేదు. తన అంచనాలకు తగ్గట్లుగా లేవంటూ తిరస్కరించేశారు. దీంతో అసలు టాలీవుడ్ లో సరైన కథ అందించల రైటర్స్ లేరంటూ సన్నిహితుల దగ్గర కామెంట్ చేస్తున్నారట మెగాస్టార్.
ఇలా కథ దొరక్కపోవడంతో డిసెంబర్ లో స్టార్ట్ చేద్దామని అనుకున్న ముహూర్తం.. ఇప్పుడు దాటిపోయేట్లుగా ఉంది. అయితే ఎలాగైనా మెగాస్టార్ తో రీఎంట్రీ ఇప్పించే స్ట్రాంగ్ స్టోరీ కోసం.. తనయుడు రామ్ చరణ్ బాలీవుడ్ బాట పట్టాడట. అక్కడ నుంచి కథలు వడ్డించే ప్రోగ్రాం స్టార్ట్ చేశాడని తెలుస్తోంది.
తండ్రి కోసం కొడుకు పడుతున్న ఆరాటం కరెక్టే కానీ.. ఇప్పుడు అక్కడ కూడా సెట్ కాకపోతే ఏం చేస్తారన్నది ప్రశ్న. ఒకవేళ అవి కూడా నచ్చకపోతే హాలీవుడ్ వెళ్లి రాయించుకొస్తారా అనే డౌట్ వస్తోంది. ఏమో.. చేసినా చేయచ్చు. ఎందుకంటే గతంలోనే ఓసారి చిరు హాలీవుడ్ సినిమా ఒకటి మొదలుపెట్టారు. 'అబు.. ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్' ఆ మూవీ పేరు. తెలుగులో అబు.. బాగ్దాద్ గజదొంగ అన్నారు లెండి. అది అర్ధాంతరంగా ఆగిపోయింది లెండి అది వేరే విషయం. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నం ఇంకోటి ఏమైనా చేస్తారేమో.