రామ్ గోపాల్ వర్మ హాస్పిటల్లో చేరాడట

Update: 2017-04-29 09:43 GMT
ఉదయం కూడా ఎంచక్కా ట్వీట్లు చేస్తూ కనిపించిన రామ్ గోపాల్ వర్మకు సడెన్ గా ఏమైంది అని ఆయన అభిమానులు కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఇది కూడా వర్మ అతిశయోక్తి ట్వీట్లలో భాగమే. వర్మకు కొత్తగా ఒక వైరస్ ఏదో సోకిందట. ఆ వైరస్ పేరు.. బాహుబలి2 జలసైటిస్ అంటున్నాడు వర్మ. అంటే బాహుబలి-2ను చూసి అసూయతో రగిలిపోవడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట ఇది.

తాను ఒక్కడే కాదని.. దేశవ్యాప్తంగా మరెందరో ఫిలిం మేకర్స్ అనేక చోట్ల ఆస్పత్రుల్లో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. బాహుబలిని చూసి బాలీవుడ్ వాళ్లు అదిరిపోతున్నారంటూ రెండు మూడు రోజులుగా వర్మ ట్వీట్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి శబ్దాన్ని తట్టుకోలేక బాలీవుడ్ డైరెక్టర్లు.. హీరోలు చెవుల్లో దూది పెట్టుకున్నారని.. బాహుబలి దెబ్బకు వాళ్లు వణికిపోతున్నారని.. ఇంకా తన మార్కుతో అనేక ట్వీట్లు చేశాడు వర్మ.

రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు కొంచెం అతిగా ఉండే మాట వాస్తవమే కానీ.. నిజంగానే ‘బాహుబలి’ ప్రభంజనం బాలీవుడ్ దర్శకుల్లో ఆందోళన.. అసూయను పెంచుతాయనడంలో సందేహం లేదు. కనీసం వేరే దర్శకులు ఊహించడానికి కూడా భయపడే స్థాయిలో ‘బాహుబలి-2’లోని కొన్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు రాజమౌళి. ఇందులోని మైనస్ పాయింట్లను ఎత్తి చూపేవాళ్లు కూడా సినిమా గురించి పూర్తి నెగెటివ్ గా అయితే మాట్లాడలేరు. దాన్ని విస్మరించలేరు. ఈ సినిమా చూడొద్దు అని చెప్పలేరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News