రాం గోపాల్ వర్మ - కోన వెంకట్ ల మధ్య అనుబంధం సీక్రెట్ ఏం కాదు. రీసెంట్ గా వర్మ తన గురువు - ఫ్రెండ్ అంటూ తనే చెప్పాడు కోన. కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ ఏ సినిమా కోసం పని చేయలేదు, ఒకరి సర్వీసులు మరొకరు ఉపయోగించుకోలేదు. అయితే ఓ మూవీ.. కాదు కాదు ఓ టైటిల్ వీళ్లిద్దరికీ మధ్య చిచ్చు పెట్టేలా ఉంది.
పాత క్లాసిక్స్ ను మళ్లీ తీసి తల బొప్పి కట్టించుకోవడంలో వర్మను ఎవరికైనా గురువు అనే అనాలి. బాలీవుడ్ లో ఎన్నో హిస్టరీలు క్రియేట్ చేసిన షోలేను.. ఆర్జీవీ కా ఆగ్ అంటూ తీసి నానా తిట్లూ తిన్నాడు. తన స్థాయిని ఈ సినిమాతో పది మెట్లు కిందకు జార్చుకున్నాడు, అయినా సరే ఈ డైరెక్టర్ కి క్లాసిక్స్ మీద మనసు చావలేదు. ఇప్పుడు 1951లో వచ్చిన పాతాళభైరవి చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందంటూ.. కిల్లింగ్ వీరప్పన్ ప్రమోషన్స్ లో చాలాసార్లే చెప్పాడు. తను తీసే సినిమా తనకు నచ్చితే చాలనే వర్మ.. తను తీయాలని అనుకున్నాక ఇక ఆగకపోవచ్చనే అంచనాలున్నాయి.
రీసెంట్ గా ఇదే టైటిల్ తో సినిమా చేసేందుకు కోన వెంకట్ కూడా ట్రై చేస్తున్నాడు. ఓ క్లాసిక్ అయిన శంకరాభరణం టైటిల్ ని ఇప్పటికే చెడగొట్టాడనే మచ్చ ఎదుర్కొంటున్న కోన.. ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు పాతాళభైరవి పేరును ఎంచుకోబోతున్నాడు. మరి ఈ టైటిల్ చివరికి ఎవరికి దక్కుతుందో.. ఎవరు ఆ సూపర్ హిట్ క్లాసిక్ టైటిల్ తో సినిమా మొదలుపెడతారో అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్సే.