టాలీవుడ్ రామాయణాల్లో కొన్ని..

Update: 2016-04-15 05:52 GMT
మన జీవితాల్లో రామాయణం ఓ భాగంగా ఎలా ఉంటుందో.. సినిమాల్లోనూ రామాయణం ఆధారంగా కథలు చాలానే ఉంటాయి. నిజానికి మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. రామాయణంలో రాముడెంతటి గొప్పవాడో, రావణుడు అంతే గొప్పవాడు. సినిమాల్లో కూడా హీరో - విలన్ లని సరి సమానంగా శక్తివంతులుగా రూపొందించి కథలు తయారు చేశారు.

రావణుడు వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్లిపోతే... రాముడు యుద్ధంలో రావణుడిని చంపి సీతను దక్కించుకుంటాడు. ఇదే థీమ్‌తో మన తెలుగులో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. విలన్ హీరోయిన్‌ ని ఎత్తుకెళ్లడం..హీరో హీరోయిన్‌ ఎక్కడుందో తెలుసుకోవడం విలన్‌ తో ఫైట్ చేసి హీరోయిన్‌ ను దక్కించుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇదే కథతో తెలుగు సినిమాలు చాలనే వచ్చాయి.

మహేష్ బాబు 'ఒక్కడు' చిత్రం థీమ్ ఇదే. 'జయం'లో నితిన్ - గోపీచంద్ కథ ఇదే. విక్రమ్ - ఐశ్వర్యారాయ్ 'రావణ్' అయితే.. మొత్తం అదే స్టోరీ. ప్రభాస్ - గోపీచంద్ ల 'వర్షం' మూవీ కూడా సేమ్ కాన్సెప్ట్. అల్లు అర్జున్ - ఆర్యల 'వరుడు' చిత్ర కథ కూడా రామాయణాన్ని ఆధారంగా రాసుకున్నదే. రవి తేజ 'కృష్ణ' కథ కూడా ఇలాగే ఉంటుంది. ఇలా మన సినిమాలకు రామాయణానికి చాలా దగ్గరి లింకులు ఉన్నాయి.

పాఠకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Tags:    

Similar News