రియల్ హీరో అని మోహనబాబుని ఓ పెద్దాయన ప్రశంసించారు. విశిష్టమైన వ్యక్తిత్వమున్న ఆ పెద్దాయన నుంచి అలాంటి ప్రశంస రావడంతో మోహన్ బాబు పరమానంద భరితుడయ్యారు. ఆ ఆనందంలో ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయట. ఆ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేసుకొన్నారు. ఇంతకీ మోహన్ బాబుని పొగిడిన ఆ పెద్దాయన ఎవరో తెలుసా? ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు.
మీడియా మొఘల్ గా పేరు గాంచిన పద్మ విభూషణ్ రామోజీరావులాంటి వ్యక్తి నుంచి ప్రశంసలు లభిస్తే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు మరీ! అయితే నిజంగానే మోహన్ బాబులో రియల్ హీరో లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి. ఎవరికీ భయపడకుండా తన మనసులో ఏదుంటే అది చెబుతారు. క్రమశిక్షణని పాటిస్తారు. నలభయ్యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకొన్న ఆయనలో ఇంకా ఎన్నో సుగుణాలు కనిపిస్తాయి కాబట్టి ఆయన ఇలాంటి ప్రశంసలకి అర్హుడే అని చెప్పొచ్చు.
సంభాషణలు చెప్పడంలో తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకుని డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు మోహన్ బాబు. విలక్షణ నటుడైన ఆయనకి బ్రిటన్ లో ఇటీవల ఓ అరుదైన గౌరవం లభించింది. అక్కడి పార్లమెంటులో మోహన్ బాబు సినిమాల్లోని డైలాగులకి సంబంధించిన డైలాగ్ బుక్ విడుదలైంది. అలాగే ఏసియన్ లైట్స్ సంస్థ నుంచి ప్రణమ్ పురస్కారాన్ని పొందారు. ఈ సందర్భంగానే రామోజీరావు మోహన్ బాబుని ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారు.
``రియల్‌హీరో అనదగ్గ వ్యక్తి మీరు`` అని ఆ లేఖలో బాబుని కీర్తించారు రామోజీరావు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు మోహన్ బాబు. ఈరోజు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. అలాగే బెస్ట్ డైలాగ్ బుక్ కి ముందు మాట రాసిన బాలకృష్ణకి కూడా మోహన్ బాబు కృతజ్ఞతలు చెప్పారు.