బాహుబ‌లి, రామోజీ.. ఎవ‌రు హ్యాండిచ్చారు?

Update: 2015-09-07 18:01 GMT
బాహుబ‌లి సినిమాతో మీడియా కింగ్ రామోజీరావుకి అవినాభావ సంబంధం ఉంది. ఈ సినిమాని 80శాతం రామోజీ ఫిలింసిటీలో తెర‌కెక్కించారు. ఆ మేర‌కు ఆర్థిక ప‌ర‌మైన చిక్కులేవీ రాకుండా ఆర్కా మీడియా సంస్థ‌కు రామోజీరావు  సాయం అయ్యారు. అయితే రామోజీ ఫిలింసిటీ లొకేష‌న్ ల కోసం పెట్టాల్సిన ఖ‌ర్చునే రామోజీ బాహుబ‌లిలో పెట్టుబ‌డిగా పెట్టార‌ని వార్త‌లొచ్చాయి.  బాహుబ‌లి వెన‌క బాహుబ‌లుడు అంటూ అప్ప‌ట్లో బోలెడ‌న్ని క‌థ‌నాలొచ్చాయి. రామోజీ స‌హాయ స‌హ‌కారాల‌కు కృత‌జ్ఞ‌త‌గా ఆర్కా మీడియా సంస్థ బాహుబ‌లి శాటిలైట్ హ‌క్కుల్ని ఈటీవీకే క‌ట్ట‌బెడుతుంద‌ని వార్త‌లొచ్చాయి.

అయితే అనుకున్న‌దొక్క‌టి, అయిన‌దొక్క‌టి.. బాహుబ‌లి రిలీజ‌య్యాక పూర్తిగా స‌మీక‌ర‌ణాలే మారిపోయాయి. ఎవ‌రు ఎవ‌రి ముందూ త‌ల‌వంచాల్సిన ప‌ని లేనంత సంప‌ద ద‌క్కింది. బాహుబ‌లి అసాధార‌ణ విజ‌యం సాధించి 600కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఇంత ఆదాయం వ‌స్తుంద‌ని నిర్మాత‌లు సైతం ఊహించ‌లేక‌పోయారు. క‌ళ్లు భైర్లు క‌మ్మే ఆదాయం ఇది. ఈ విజ‌యం త‌ర్వాత నిర్మాత‌ల ఆలోచ‌న మారిందో ఏమో.. బాహుబ‌లి శాటిలైట్ హ‌క్కులు రామోజీరావుకు కాకుండా మాటీవీ కి క‌ట్ట‌బెట్ట‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది.

మాటీవీ ఇటీవ‌లే బాహుబ‌లి1, బాహుబ‌లి 2 చిత్రాల‌కు శాటిలైట్ రూపంలో 30కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని ఆల్రెడీ చెప్పకున్నాం. అంటే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో రామోజీ రావుకు బాహుబ‌లి హ్యాండిచ్చిన‌ట్టా?  లేక రామోజీరావే బాహుబ‌లి టీమ్‌ కి హ్యాండిచ్చిన‌ట్టా? అన్న‌ది తేల‌డం లేదు ఇంత‌వ‌ర‌కూ.
Tags:    

Similar News