రెండో సినిమాకీ రామోజీ అండ!

Update: 2015-07-11 09:11 GMT
మూడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకొంది బాహుబలి బృందం. సినిమాని చూసినవాళ్లంతా అద్భుతం అంటున్నారు. కథ, కథనాల విషయంలో కొద్దిమంది మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నా... ఓవరాల్‌గా జక్కన్న సూపర్‌ హిట్‌ అనిపించాడు. ఎప్పుడూ థియేటర్‌కి రానివాళ్లు కూడా బాహుబలి కోసం థియేటర్‌లోకి అడుగుపెట్టి సినిమా చూస్తున్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు, పలువురు బ్యూరోక్రాట్లు సినిమాని చూశారు. మీడియా మొఘల్‌ రామోజీరావు కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా షో వేయించుకొని తన స్టాఫ్‌తో కలిసి సినిమాని చూశారట. అనంతరం 'అద్భుతం...' అంటూ  రాజమౌళిని మెచ్చుకొన్నారట. సెకండ్‌ పార్ట్‌కి కూడా తనవంతుగా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండో సినిమా పనుల్ని మొదలుపెట్టాలని రామోజీరావు సూచించారట. తొలి పార్ట్‌ బాహుబలికి రామోజీరావు ఆర్థికంగా, ఫిల్మ్‌సిటీ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించిన విషయం తెలిసిందే. రెండో పార్ట్‌కి కూడా చిత్రబృందం ఏం అడిగితే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. సినిమాని, రాజమౌళిని అభినందిస్తూ లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ కూడా ఓ బహిరంగ లేఖని విడుదల చేశారు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాజమౌళిని ఆయన కొనియాడారు.

Tags:    

Similar News