బాలీవుడ్ లో మరో సారి రానా

Update: 2018-01-19 07:36 GMT
టాలీవుడ్ హీరోల్లో చాలా మంది హీరోలు బాలీవుడ్ లో కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కువగా ఎవరు సక్సెస్ కాలేకపోయారు. కానీ రానా మాత్రం మంచి అవకాశాలను అందుకొని బాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చేసింది సైడ్ క్యారెక్టర్స్ అయినా సరే రానా అంటే ఇతనే అనేలా బాలీవుడ్ లో క్రేజ్ ను అందుకున్నాడు. ఆ తరువాత బాహుబలి సినిమాతో ఇంకా ఫేమస్  అయ్యాడు.

అసలు బాహుబలి బాలీవుడ్ కి వెళ్లడానికి అసలు కారణం రానా నే. ఏ జవాని హై దివాని సినిమాతో రానాకి అలాగే కరణ్ జోహార్ కి మంచి స్నేహం ఏర్పడింది. అయితే కరణ్ జోహార్ ద్వారా బాహుబలిని నార్త్ లో భారీగా రిలీజ్ చేయించాడు రానా. ఇక వీరి కలయికలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. అయితే ఫైనల్ గా ఇప్పుడు మరొక డిఫెరెంట్ కథతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో చాలా వైరల్ అయ్యింది.

చక్రి తోలేటి దర్శకత్వంలో వెల్కమ్ టూ న్యూ యార్క్ అనే 3D కామెడీ సినిమా తెరకెక్కుతోంది. సోనాక్షి సిన్హా - దిలీజిత్ దోసఙ్హ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే కరణ్ జోహర్ - రానా - రితేష్ దేశ్ముఖ్ - బోమన్ ఇరానీ వంటి స్టార్ నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. దాదాపు ఆ సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేయాలని దర్శకుడు అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఆ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News