బాహుబలి సినిమా తర్వాత రానా స్టార్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా రానా తన సినిమాలను రిలీజ్ చేసుకుంటూ తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఘాజి - నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో పరభాష అభిమానులను కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం రానాకు ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. కానీ కేవలం వెరైటీ కథలను మాత్రమే ఈ హీరో సెలక్ట్ చేసుకుంటున్నాడు.
అయితే రానా తనకు కథ చెప్పడానికి వస్తోన్న దర్శకుల బ్యాక్ గ్రౌండ్ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కథలో కంటెంట్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తున్నాడు. అయితే అదే తరహాలో మారో చిన్న దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరకతమణి సినిమాతో తెలుగు - తమిళ్ ప్రేక్షకులను థ్రిల్ చేసిన దర్శకుడు ఏఆర్కే శరవణన్.. రానాకు మంచి క్రైమ్ థ్రిల్లర్ కథను చెప్పి మెప్పించాడట. దీంతో రానా దర్శకుడి చెప్పడాన్ని బట్టి అతనిపై చాలా నమ్మకం కలగడంతో కథ చాలా బావుంది తప్పకుండా చేద్దాం అని చెప్పాడట.
కాకపోతే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం వెయిట్ చేయమని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రానా 1945 సినిమా కథతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత శరవణన్ తో సినిమా చెయ్యాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక అంతా సెట్ అయితే ఒకేసారి తెలుగు - తమిళ్ లో ఎమ్.ఎమ్ రత్నం సినిమాను నిర్మించడానికి రెడీగా ఉన్నారట. మారి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.