వీడియో : నచ్చావ్ రానా... నీలా మరెవ్వరు ఉండరు

Update: 2022-06-14 07:30 GMT
టాలీవుడ్‌ లోనే చాలా పెద్ద సెలబ్రెటీ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో... నటుడిగా ఎన్న సినిమాల్లో నటించి హీరోగా మంచి స్టార్‌ డమ్ దక్కించుకున్నాడు. అనుకుంటే వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తూ తనను తాను భారీ హీరోగా ప్రజెంట్‌ చేసుకునే సత్తా పలుకుబడి ఆయనకు ఉంది. అయినా కూడా ఆయన చాలా సింపుల్‌ గా ఉంటాడు.. మనవాడు అన్నట్లుగా అనిపిస్తాడు.. అతడే హీరో రానా.

ఆయన కోరుకుంటే ఏడాదికి రెండు మూడు కమర్షియల్‌ సినిమాలను చేస్తూ హీరోయిజం చూపించవచ్చు. కాని ఆయన కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న సినిమాలు.. పాత్రలు ఆయన యొక్క గొప్పతనంను చూపిస్తాడు. లీడర్ సినిమాతో ఏ కొత్త హీరో కూడా అది కాకుండా పెద్ద ఫ్యామిలీ కి చెందిన హీరో పరిచయం అవ్వాలి అనుకోడు. కాని రానాకు లీడర్‌ నచ్చి చేశాడు.

కమర్షియల్‌ గురించి ఆలోచించకుండా ఒక మంచి సినిమాను చేయాలి.. మంచి టెక్నీషియన్స్ తో చేయాలి అనుకుంటాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'విరాటపర్వం'. సినిమా లో రానా కీలక పాత్రలో నటించాడు. హీరోయన్ గా సాయి పల్లవి నటించింది. ఇలాంటి కథలను హీరో సెంట్రిక్ గా మార్చి చేసినా కాదు అనేవారు ఉండరు. కాని హీరోయిన్ ఓరియంటెడ్ అయితేనే బాగుంటుందని రానా భావించి విరాటపర్వం చేశాడు.

ఒక పెద్ద హీరో.. అది కూడా మంచి గుర్తింపు ఉన్న హీరో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా లో నటించేందుకు ఓకే చెప్పడం అంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద విషయం. రానా ఆ పని చేసి గొప్ప వాడు అనిపించుకున్నాడు. తాజాగా సినిమా ప్రమోషణ్ కార్యక్రమాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు తో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అభిమానులు కాకుండా ఉండలేక పోతున్నారు.

కర్నూలు లో జరిగిన ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమం సందర్బంగా వర్షం వచ్చింది. ఆసమయంలో సాయి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం ఈగో కు వెళ్లకుండా ఆమెకు గొడుకు పట్టుకున్నాడు. తాజాగా కూడా ఈవెంట్ లో జనాలు ఆమె పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఒక బౌన్సర్ మాదిరిగా ఆమెకు రక్షణ కల్పించాడు. ఆమె పబ్లిక్ ఈవెంట్‌ లో ఉన్న సమయంలో తాను ఒక హీరోను అనే విషయాన్ని పట్టించుకోకుండా సాయి పల్లవిని జాగ్రత్తగా చూసుకున్న విధానం ప్రతి ఒక్కరు గుర్తించారు.

రానా మొదటి నుండి ఒక మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయన సాయి పల్లవి వంటి ఒక హీరోయిన్ తో వ్యవహరిస్తున్న తీరు.. ఆమె కోసం తాను తగ్గి ఎదిగిన తీరు అద్బుతం అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. రానా మాదిరిగా టాలీవుడ్‌ లో ఏ ఒక్కరు ఉండరు. స్టార్‌ హీరోలు కాదు.. చిన్న హీరోలు కూడా హీరోయిన్స్ కు అంత గౌరవం మర్యాద ఇవ్వరు అనేది విశ్లేషకుల అభిప్రాయం.


Full ViewFull View
Tags:    

Similar News