ముద్దు సీన్‌కి 37 టేక్‌లు... హీరో, హీరోయిన్‌ రియాక్షన్‌ ఏంటో!

అందుకే బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు సైతం ఆయనతో సినిమాలను నిర్మించేందుకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లతో ఎదురు చూస్తున్నారు.

Update: 2025-02-01 07:30 GMT

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్ ఆర్యన్ బ్యాక్‌ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ స్టార్‌ హీరోల సరసన నిలిచాడు. ఈమధ్య కాలంలో వచ్చిన భూల్‌ భులయ్యా 3తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ ఫిల్మ్‌ మేకర్స్‌తో పాటు కొత్త ఫిల్మ్‌ మేకర్స్ కార్తీక్ ఆర్యన్ వెంట పడుతున్నారు. ఆయనతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే సెంటిమెంట్‌ని అంతా బలంగా నమ్ముతున్నారు. అందుకే బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు సైతం ఆయనతో సినిమాలను నిర్మించేందుకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా కార్తీక్ ఆర్యన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.

తన కెరీర్‌ ఆరంభంలో నటించిన 'కాంచి' అనే సినిమా షూటింగ్‌ అనుభవాలను కార్తీక్ ఆర్యన్‌ షేర్ చేసుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా మిస్తి నటించింది. ఆ సినిమాలోని ముద్దు సన్నివేశం గురించి కార్తీక్ ఆర్యన్ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. కాంచి సినిమాలోని ఒక సన్నివేశంలో భాగంగా హీరోయిన్‌ మిస్తికి తాను ముద్దు పెట్టాల్సి ఉంది. ఇద్దరి మధ్య ప్రేమకు గుర్తుగా ఆ ముద్దు పెట్టుకోవాలని దర్శకుడు చెప్పాడు. తనకు ముద్దు పెట్టడానికి ఆ సమయంలో చాలా మొహమాటంగా ఉండేది. అయినా ముద్దు సన్నివేశంకు నటించేందుకు సిద్ధం అయ్యాను. మిస్తితో తన ముద్దు షాట్‌కి దర్శకుడు అసలు సంతృప్తి చెందలేదు.

రెండు కాదు మూడు కాదు ఏకంగా 37 టేక్‌ల తర్వాత ఆ ముద్దు సన్నివేశంకు దర్శకుడు ఓకే చెప్పాడు . ముద్దు పెట్టడం నాకు ఏమీ ఇబ్బంది లేదు, కానీ హీరోయిన్‌ మిస్తి ఎలా ఆలోచిస్తారో అని భయపడ్డాను. నన్ను ఎక్కడ మిస్తీ అపార్థం చేసుకుంటుందో అని ఆందోళన చెందాను. కానీ మిస్తీ దర్శకుడు చెప్పినట్లు చేయడం కోసం అన్ని టేక్‌లకు ఓకే చెప్పింది. ఒకానొక సమయంలో నాకు చిరాకు వేసింది. దర్శకుడిపై అసహనం వ్యక్తం చేశాను. ఆయన్ను వచ్చి ఒకసారి పెట్టి చూపించు అని ఎగతాళిగా అన్నాను. అయినా దర్శకుడు మాత్రం తనకు సంతృప్తి కలిగే వరకు టేక్‌లు చేస్తూనే వచ్చాడు. 37 సార్లు చేసిన తర్వాత టేక్ ఓకే అన్నాడని కార్తీక్‌ ఆర్యన్‌ చెప్పుకొచ్చాడు.

ముద్దు సన్నివేశం సాధారణంగా ఒకటి రెండు షాట్స్‌కే పూర్తి చేయాలని ఎవరైనా భావిస్తారు. రెండు మూడు టేక్‌లు మించితే ఆ సీన్‌ను తీయడం కష్టం అవుతుంది. హీరోయిన్‌, హీరో ఇద్దరూ ముద్దు సన్నివేశంకు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సన్నివేశం బాగా వస్తుంది. దర్శకుడు స్పెషల్‌ గా ఏమైనా చూపించాలి అనుకుంటే మాత్రం అప్పుడు దాన్ని చూపించేందుకు హీరో, హీరోయిన్స్‌ కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కాంచి దర్శకుడు సైతం కార్తీక్‌ ఆర్యన్‌, మిస్తీల ముద్దును చాలా స్పెషల్‌గా చూపించాలనే ఉద్దేశ్యంతో అన్ని టేక్‌లు చేయించాడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్ల క్రితం ముచ్చట ఇప్పుడు కార్తీక్‌ ఆర్యన్‌ చెప్పడంతో మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News