ఇంగ్లీష్‌ సరిగ్గా నేర్చుకోరా ఫూల్‌!!!

Update: 2015-07-06 11:04 GMT
మీరు మహేష్‌బాబుతో సినిమా చేస్తారా? ఒకవేళ సినిమా చేస్తే అందులో తమ్ముడిగా చేస్తారా లేకపోతే ఫ్రెండ్‌గానా, లేకపోతే విలన్‌గానా? అంటూ నెట్‌లో బల్లాలదేవుడు రానా దగ్గుబటిపై ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. ఆస్క్‌ రానా అంటూ సాగుతున్న ట్విట్టర్‌ క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌ కార్యక్రమంలో మనోడు చాలా యాక్టివ్‌గా పాల్గొని ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్‌ చెప్పాడు. అయితే ఈ విషయంలో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ నుండి కాస్త హాట్‌ ఫేస్‌ చేయలేకతప్పలేదు.

పై ప్రశ్నలకు రానా ''నథింగ్‌'' అని ఆన్సర్‌ చెప్పాడు. దానితో కోపోద్రిక్తులైన మహేష్‌ ఫ్యాన్స్‌ మనోడ్ని బూతులు కూడా తిట్టేశారు. అయితే పచ్చి బూతులు తిడుతుంటే సైలెంట్‌గా ఎందుకుంటాడు మనోడు, తను కూడా స్పందించాడు. ''నథింగ్‌ అంటావ్‌ ఏంట్రా ఫూల్‌?'' అంటూ ఒక ఫ్యాన్‌ స్పందించాడు. రానా ఊరుకోడుగా.. తిరిగి కోటింగ్‌ ఇచ్చేశాడు.. ''ముందు ఇంగ్లీష్‌ సరిగ్గా నేర్చుకోరా ఫూల్‌. నథింగ్‌ అంటే ఇంకా అలాంటి కథ ఏమీ రెడీ కాలేదు అని. ఏమీ లేకుండా అసలు ఏమని స్పందిస్తాను'' అంటూ సమాధానం చెప్పాడు రానా. మొత్తానికి ఆన్‌లైన్‌ మన ముఖం కనిపించదు, మనం ఎదురుగుండా ఉండము కాబట్టి ఏదైనా చెప్పేయవచ్చు, నోటికొచ్చింది తిట్టేయవచ్చు అనుకునే నెటిజన్లకు అప్పుడప్పుడు రానా వంటి స్టార్స్‌ నుండి కోటింగ్‌ తప్పదేమో. అవకాశం, తన క్యారెక్టర్‌ గొప్పతనం, అలాగే నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌.. ఇలాంటి విషయాలపై ఆధారపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కాని.. తండ్రి రోలా తాతయ్య రోలా అని ఎవరైనా చూస్తారేంటండీ..



Tags:    

Similar News