కండ‌ర‌గండ‌డి ప్రిప‌రేష‌న్ ఆ లెవ‌ల్లో

Update: 2022-04-16 01:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ రూపం అమాంతం మారిపోతోంది. చూస్తుండ‌గానే బీస్ట్ మోడ్ లోకి వ‌చ్చేస్తున్నాడు. జిమ్ లో చెమ‌ట‌ల‌తో త‌డిసిన అత‌డి రూపం ప‌వ‌ర్ ప్యాక్డ్ లుక్ స్ట‌న్న‌ర్ గా నిలుస్తున్నాయి. అయితే ఇంత‌టి ప్రిప‌రేష‌న్ దేని కోసం అంటే దానికి ప్ర‌త్యేక‌ కార‌ణం ఉంది.

IIFA 2022 కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మే 22న పవర్ ప్యాక్డ్ ప్రదర్శన ఇవ్వ‌నున్నారు. దీనికి అత‌డు ప్రిప‌రేష‌న్ ప్రారంభించారు. మే 22న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్- 2022 ఇర‌వై రెండ‌వ ఎడిషన్ లైవ్ వైర్ ఆన్ స్టేజ్ ప్రదర్శన కోసం ర‌ణవీర్ తో పాటు డ్యాన్స‌ర్ల టీమ్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

భారతీయ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ది బెస్ట్ గా జరుపుకునే ఈవెంట్ ఇది. అత్యంత గౌర‌వంతో కూడుకున్న ఈ ఈవెంట్ కోసం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ర‌ణ‌వీర్ సిద్ధ‌మవుతున్నాడు. IIFA వారాంతంతో పాటు మే 20 .. మే 21 తేదీల్లో జరగనున్న IIFA అవార్డులు అబుదాబిలోని యాస్ ద్వీపానికి వ‌ర‌ల్డ్ వైడ్ బ్రాండ్ గా పాపులారిటీని తెస్తాయి. ఈ గ్లోబల్ ఈవెంట్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్- రితీష్ దేశ్ ముఖ్- మనీష్ పాల్ హోస్టింగ్ చేయనున్నారు. ఈ వేదిక‌పై యూనిక్ స్టైల్ తో బీస్ట్ మోడ్ లో క‌నిపించాల‌న్న‌ది ర‌ణ‌వీర్ ఆలోచ‌న‌. అందుకే ఈ క‌స‌ర‌త్తులు అన్న‌మాట‌.

ఈ సందర్భంగా రణవీర్ సింగ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ-``యాస్ ఐలాండ్ నాకు ఇల్లు లాంటిది. నేను ఇంత అద్భుతమైన గమ్యస్థానానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను! ప్రదర్శనతో ప్రజలను అలరించడానికి నేను అక్కడికి వెళ్లడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సూపర్ స్పెషల్ ఇది .. అని ఆనందం వ్య‌క్తం చేశారు.

ఇండియన్ సినిమా అతిపెద్ద వేడుక - ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ & అవార్డ్స్ 22వ ఎడిషన్ వేడుక అత్యంత భారీగా జ‌ర‌గ‌నుంది.  యాస్ లో IIFA అనుభవం ఎందుకంటే ఆతిథ్యం నుండి విస్మయపరిచే వేడుకల వరకు ఇది మ‌హ‌దాద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు అని ర‌ణ‌వీర్ అన్నారు.
Tags:    

Similar News