తెలుగు సహాయ నటులు ఇరుగు పొరుగున రాణించిన సందర్భాలున్నాయి. తమిళం నుంచి అనువాద చిత్రాలతో వడివేలు ఇక్కడ ఎలా ఫేమస్ అయ్యారో అలాగే బ్రహ్మానందం కి తెలుగు అనువాదాలతో ఇరుగుపొరుగు భాషల్లోనూ అంతే పేరొచ్చింది. పలువురు తెలుగు నటులకు అనువాద చిత్రాలతో పొరుగు భాషల్లో గుర్తింపు దక్కింది.
ఇప్పుడు మరో తెలుగు క్యారెక్టర్ నటుడు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతకుముందు తమిళంలో అతడికి రంగ ప్రవేశం ఉన్నా కానీ ఇప్పుడు అనూహ్యమైన క్రేజ్ ని తెచ్చింది ఓ సినిమా. తాజాగా సూర్య నటించిన జై భీమ్ తెలుగు-తమిళ చిత్రంలో రావు రమేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తెలుగు తమిళం రెండు చోట్లా అతడి పాత్ర బాగా రీచ్ అయ్యింది. `జై భీమ్` లో అడ్వకేట్ జనరల్ రామ్ మోహన్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు. ప్రభుత్వం తరపున మోస్ట్ పవర్ ఫుల్ డిఫెన్స్ లాయర్ గా ఆయన నటన ఆహార్యానికి చక్కని గుర్తింపు దక్కింది. కోర్ట్ సన్నివేశాల్లో హీరో సూర్యకు ధీటుగా లాజిక్ లతో కొట్టేసిన రావు రమేష్ కనిపించిన ఇరవై నిమిషాలు అదరగొట్టారన్న టాక్ వచ్చింది.
రావుగోపాల్రావ్ వారసుడిగా రావు రమేష్ కి ఇప్పటికే తెలుగు చిత్రసీమలో గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తమిళంలోనూ ఆయన పేరు ఘనంగా మోగుతోంది. అతడికి మునుముందు తమిళంలోనూ క్రేజీ అవకాశాలు దక్కనున్నాయని తాజా పరిణామం చెబుతోంది. ఇక రావు రమేష్ తమిళ డైలాగులు కూడా అద్భుతంగా కనెక్టయ్యాయని తమిళ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు కాబట్టి అక్కడ అవకాశాలొస్తాయేమో చూడాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న జై భీమ్ చిత్రం అతడి దశ దిశను మారుస్తుందనే ఊహిస్తున్నారు. అతను ఇంతకుముందు కొన్ని తమిళ చిత్రాలలో కనిపించినప్పటికీ జై భీమ్ పెద్ద రీచ్ సాధించడమే గాక ప్రశంసలు పొందడంతో ఇది పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇక రావు రమేష్ చెన్నైలోని టి నగర్ లోని రామకృష్ణ మిషన్ పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. అతని బాల్యం యుక్తవయస్సు చెన్నైలో గడిచింది. తమిళ ఇండస్ట్రీలో స్నేహితులకు పరిచయం ఉండడం వల్ల భాషపై పట్టు సాధించారని తెలిసింది.