టాలీవుడ్ గొప్పదని మా నాన్నే చెప్పారు: స్టార్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో స్పెషల్ డేస్ వచ్చాయంటే సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో వారి మెమోరీస్ షేర్ చేసుకుంటారు. తాజాగా నేషనల్ క్రష్ - టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన.. ఫాదర్స్ డే సందర్బంగా తన ఫాదర్ మదన్ గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రష్మిక మందన అంటే కేవలం తెలుగు మాత్రమే కాదు. అటు తమిళం.. ఇటు హిందీలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. ఎందుకంటే ఆయా భాషల్లో అమ్మడు ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. కానీ ఏ భాషలో చేసినా రష్మికను స్టార్ హీరోయిన్ చేసింది మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీనే.
అయితే కన్నడలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మడు ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ రష్మిక తెలుగు సినిమాల్లో అడుగు పెట్టడానికి కారణం ఆమె తండ్రి మదన్ అని చెబుతోంది. కన్నడలో సినిమాలు చేసే టైమ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఛలో సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఆ టైంలో నాకు టాలీవుడ్ అంటే పెద్దఇండస్ట్రీ అని భయం వేసింది. కానీ నాకు మా నాన్న గారే ధైర్యం చెప్పి తెలుగు ఇండస్ట్రీ పై నమ్మకం కలిగేలా చేసి ప్రోత్సాహం అందించారని.. ఆయన కారణంగానే ఈరోజు తెలుగులో ఇంతమంది అభిమానం పొందుతున్నట్లు తెలిపింది. మొత్తానికి ఫాదర్స్ డే సందర్బంగా రష్మిక తన ఫాదర్ గురించి పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం అమ్మడు కెరీర్ పరంగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. అలాగే శర్వానంద్ సరసన ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేయనుంది. ఇక తమిళంలో ఓ సినిమా.. హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఆల్రెడీ తమిళంలో డెబ్యూ హిట్ అందుకున్న రష్మిక.. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో డెబ్యూ చేయబోతుంది. అనంతరం అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమాను లైన్ లో పెట్టుకుంది అమ్మడు. మొత్తానికి రష్మిక సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది.